స‌మంత స‌మంతేన‌బ్బా..

ప్రస్తుతం టాలీవుడ్లో ఫ్యాషన్ విషయంలో మంచి టేస్టున్న స్టార్ హీరోయిన్ ఎవరు అంటే మరో మాట లేకుండా సమంత పేరు చెప్పేయొచ్చు. స్టైలిస్ట్ నీరజ కోన సహకారంతో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది సమంత. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం తరఫున చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన సమంత.. అక్కడ కూడా తన స్పెషాలిటీ చూపిస్తోంది. చేనేత దుస్తులతోనూ సెక్సీగా ఎలా కనిపించవచ్చో ఈ మధ్య ఒక ఫొటో షూట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా మరోసారి హ్యాండ్ లూమ్ వేర్ తో ఆమె ఇచ్చిన ఫ్యాషన్ స్టేట్మెంట్ అందరినీ ఆకట్టుకుంది.

బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డుల కార్యక్రమంలో సమంత వేసుకున్న డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతోంది. చేనేత దుస్తుల్ని ఎంత స్టైల్ గా మలచవచ్చో.. వాటితో ఎంత బ్యూటిఫుల్ గా కనిపించవచ్చో సమంత రుజువు చేసింది. పొరుగు రాష్ట్రానికి వెళ్లి అక్కడ మన చేనేత వస్త్రాల్ని ప్రమోట్ చేసిన తీరుకు ఇక్కడి జనాలు ముగ్ధులైపోయారు.

అందరూ ఆమె మీద ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతైనా సమంత సమంతే అంటూ ఆమెను ఆకాశానికెత్తేశారు. ఆ వేడుకలో సమంతే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.తమిళంలో గత ఏడాది బ్లాక్ బస్టర్ అయిన ‘తెరి’ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ పాపులర్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది సమంత.


Recent Random Post: