
కాబోయే మామగారు నాగార్జునని సమంత ఏమని పిలుస్తుందో తెలుసుకోవాలని ఉబలాటం అభిమానులకి వుండడం సహజం. సమంత వేసే ట్వీట్లని బట్టి, ఆమె అభిమానులకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి చాలా సరదా మనిషి అనేది అర్థమవుతుంది. అలాంటి అమ్మాయి సెలబ్రిటీ మామగారిని పిలిచే పిలుపు ఖచ్చితంగా స్పెషల్‌గానే వుంటుంది.
అంత స్పెషల్‌గా వుండాలనే ఇంతవరకు నాగ్‌ని ఏమని పిలవాలనేది డిసైడ్ అవలేకపోయానని సమంత చెప్పింది. ఇంతవరకు ఆయనని ఎలా పిలిస్తే కరక్ట్ అనేది తెలీలేదని, ఇంకా దాని గురించే ఆలోచిస్తున్నానని చెప్పింది. మరి ఇంతవరకు డిసైడ్ కాకపోతే ఇప్పుడేమని పిలుస్తుందో మరి. నాగార్జున మాత్రం ‘మనం’లో తనకి అమ్మగా నటించింది కనుక సమంతని ‘అమ్మ’ అనే పిలుస్తుంటారు. నాగార్జున గురించి ఒక్క మాటలో చెప్పమని అడిగితే ‘పర్‌ఫెక్షనిస్ట్’ అని సమంత చెప్పింది.
మూడ్ బాగాలేనపుడు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు లెక్కలేనన్ని తినేస్తుంటానని ఆమె ఒక ఫాన్‌తో అంది. పెళ్లి తర్వాత కూడా నటించడం ఖాయమని, ఈ ఏడాదిలో తన జీవితంలో ఎన్నో విశేషాలు జరగబోతున్నాయని, వాటి కోసం ఎదురు చూడలేకపోతున్నానని సమంత అంటోంది.
Recent Random Post: