
సంపత్ నంది ‘గౌతమ్ నంద’ ట్రెయిలర్‌తో అందరినీ షాక్‌కి గురి చేసాడు. గోపిచంద్‌తో ఇంత కాస్ట్‌లీగా మరే దర్శకుడు సినిమా తీసి వుండడేమో. గోపిచంద్ రీసెంట్ ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా నిర్మాతలతో అంత ఖర్చు పెట్టించాడంటే సంపత్ నంది వారికి ఎంత నమ్మకం కలిగించాడనేది అర్థం చేసుకోవచ్చు.
రచ్చ చిత్రానికి సంపత్‌కి బ్రేక్ ఇచ్చి అతనికి భాకీ బడ్జెట్ చిత్రాలకి ఛాన్స్ వచ్చేట్టు చేసింది రామ్ చరణ్. అప్పట్నుంచీ చరణ్‌తో మరో చిత్రం చేయాలని సంపత్ ఎదురు చూస్తూనే వున్నాడు. కానీ చరణ్ మళ్లీ సంపత్‌కి పిలుపు ఇవ్వలేదు. ‘గౌతమ్ నంద’ ట్రెయిలర్‌తో సంపత్ నంది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు.
క్వాలిటీ విజువల్స్‌తో తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రం కనుక హిట్ అయితే చరణ్ నుంచి మళ్లీ కబురు వస్తుందని అతను ఆశిస్తున్నాడు. చరణ్ కోసం ‘చోటా మేస్త్రి’తో పాటు మరో కథ కూడా రాసి పెట్టుకున్న సంపత్ నంది ఏదో ఒక కథకి మెగా పవర్‌స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఆశిస్తున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల బాట పట్టిన చరణ్ మరి కమర్షియల్ నందిని తిరిగి తన దగ్గరకి రానిస్తాడా లేదా అనేది చూడాలి.
https://www.youtube.com/watch?v=qQiVw9a1Fs8
Recent Random Post: