సంక్రాంతి సినిమా.. షాకింగ్ కలెక్షన్స్

శతమానం భవతి బడ్జెట్ రూ.9 కోట్లు. ఆ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.11 కోట్లు. సినిమా మీద దిల్ రాజుకు ఎంత నమ్మకం ఉన్నప్పటికీ.. సంక్రాంతికి భారీ సినిమాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం రూ.15 కోట్ల షేర్ రాబట్టినా గొప్పే అనుకున్నారంతా.

కానీ ఈ చిత్రం దానికి రెట్టింపు షేర్ సాధించేలా ఉండటం అనూహ్యమే. రూ.10 కోట్లు.. రూ.15 కోట్లు.. రూ.20 కోట్లు.. రూ.25 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ఈ సినిమా షేర్ ఇప్పుడు ఏకంగా రూ.28.5 కోట్లకు చేరుకుంది. 16 రోజుల్లో ఈ సినిమా సాధించిన షేర్ ఇది. గ్రాస్ రూ.43 కోట్లను దాటింది.

నైజాం ఏరియాలో స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ‘శతమానం భవతి’ ఇప్పటిదాకా రూ.9.4 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక్కడ దిల్ రాజే స్వయంగా సినిమాను రిలీజ్ చేసుకున్నాడు. ఆయన బయటి వాళ్లకు అమ్మితే రూ.3-4 కోట్ల మధ్య వచ్చేదేమో. కానీ సొంతంగా రిలీజ్ చేసుకుని దానికి మూడు రెట్లు రాబట్టుకుంటున్నాడు. దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్న మరో ఏరియా వైజాగ్. ఇక్కడ కూడా ‘శతమానం భవతి’కి అనూహ్యమైన వసూళ్లే వచ్చాయి. రూ.4.5 కోట్ల షేర్ వచ్చింది ఇప్పటిదాకా అక్కడ.

సీడెడ్లో మాత్రమే ఈ సినిమా అనుకున్నంతగా పెర్ఫామ్ చేయలేకపోయింది. అక్కడ నాలుగు జిల్లాలో కలిపి రూ.2.64 కోట్లు వచ్చాయి. కానీ తూర్పు గోదావరి ఒక్క జిల్లాలోనే ఈ సినిమాకు రూ.2.6 కోట్ల షేర్ రావడం విశేషం. మిగతా ఏరియాలన్నింట్లో బంపర్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల వరకే ‘శతమానం భవతి’ షేర్ రూ.25 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. అమెరికా షేర్ రూ.2 కోట్లు దాటింది. మొత్తంగా రూ.28.5 కోట్ల దగ్గర ఉన్న ‘శతమానం భవతి’ డిస్ట్రిబ్యూటర్ షేర్.. త్వరలోనే రూ.30 కోట్ల మార్కును కూడా దాటబోతోంది.


Recent Random Post: