
సెన్సార్ బోర్డు వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. సినిమాలలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్ లు తొలగించడం సెన్సార్ బోర్డు సభ్యుల బాధ్యత. అంతవరకూ ఓకే. కానీ, ఈ మధ్య సెన్సార్ సభ్యులు కేవలం సినిమాలకే కాకుండా …సినిమా నిర్మాతలకు కూడా కట్ లు చెబుతున్నారు. తమ పరిధిని దాటి నిర్మాతలపై, వారి వేషధారణలపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు చైర్మన్ నిహ్లానీ తీరుతో విసిగి పోయిన దర్శక నిర్మాతలకు తాజాగా సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి.
తమ సినిమాలకు లెక్కకు మించిన కట్లతో ఏ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న బోర్డు సభ్యుల వ్యవహార శైలికి వ్యక్తిగత విమర్శలు డా తోడవ్వడం దర్శక నిర్మాతలకు చిరాకు తెప్పిస్తోంది. బాలీవుడ్ సినిమా బాబుమోషాయ్ బందూక్బాజ్ కు సెన్సార్ బోర్డు ఏకంగా 48 కత్తెరలు వేసిన సంగతి తెలిసిందే. అన్ని కట్ లు చెప్పడమే కాకుండా చిత్ర నిర్మాత కిరణ్ ష్రఫ్ ను సెన్సార్ సభ్యులు దుర్భాషలాడారట.
నువ్వు ఒక మహిళవై ఉండి.. ఇలాంటి సినిమాను ఎలా తీశావని కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) తనను ప్రశ్నించిందని నిర్మాత కిరణ్ ష్రఫ్ తెలిపారు. ‘మొదట మా సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తామన్నారు. అనంతరం సినిమాలో 48 కట్లు ఉంటాయని చెప్పారు. సినిమా పెద్దల కోసమే అయినప్పుడు అన్ని కట్లు ఎందుకు అని మేం వాదించినా వారు పట్టించుకోలేదు’ అని నిర్మాత కిరణ్ ష్రఫ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు.
ఈ దశలో సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు తన వైపు తిరిగి.. ‘మీరు ఆడవారై ఉండి ఇలాంటి సినిమాను ఎలా తీశారు?’ అని ప్రశ్నించిందని కిరణ్ ష్రఫ్ తెలిపారు.
‘చూడండి ప్యాంటు, షర్ట్ వేసుకుంది. మహిళ ఎలా అవుతుంది’ అంటూ మరో సభ్యుడు ఆ సభ్యురాలి వ్యాఖ్యలను సమర్థించాడని కిరణ్ ష్రఫ్ తెలిపారు. చేశాడు. వారన్న మాటలకు తనకు దిమ్మతిరిగిపోయిందని ఆమె చెప్పారు. నిర్మాతలు ఈ తరహా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరమని ఆమె అన్నారు. ధరించే దుస్తుల ఆధారంగా మహిళలను జడ్జ్ చేసే వ్యక్తులు.. ఆ సినిమాకు ఎటువంటి సర్టిఫికేట్ ఇవ్వగలరో గ్రహించవచ్చని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Recent Random Post: