
సూపర్‌స్టార్ లీగ్‌లోకి చేరకపోయినా కానీ మిడిల్ రేంజ్ హీరోల్లో నాగచైతన్య టాప్‌గా చలామణీ అవుతూ వచ్చాడు. ఈ రేంజ్లో చాలా మంది హీరోలు వున్నప్పటికీ యంగ్ డైరెక్టర్లు ఎక్కువగా నాగచైతన్యనే ప్రిఫర్ చేసేవారు. అతనైతే సొంత నిర్మాణ సంస్థ వుంది కనుక సినిమా తీయడానికి, రిలీజ్ చేయడానికి ఇబ్బందులు వుండవని చైతూ వైపు వెళ్లేవారు.
అయితే ఏ హీరో అయినా ఒక నాలుగైదు సినిమాల తర్వాత అయినా తన రేంజ్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తాడు. కానీ చైతన్య మాత్రం ఆ విధంగా ముందుకెళ్లలేకపోయాడు. ప్రేమమ్‌తో అతనికి బ్లాక్‌బస్టర్ వస్తుందని అనుకున్నారు కానీ జస్ట్ హిట్‌తో సరిపెట్టుకుంది. చైతన్య తన రేంజ్ పెంచుకోవడానికి తంటాలు పడుతూ వుంటే, ఎలాంటి స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఇద్దరు యువ హీరోలు నెమ్మదిగా నిచ్చెన ఎక్కుతూ వచ్చారు. వరుసగా మంచి కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో నమ్మకం పెంచుకున్నారు. సరైన సినిమా వచ్చేసరికి చెరో బ్లాక్‌బస్టర్ కొట్టేసారు. శతమానం భవతితో శర్వానంద్ భారీ విజయాన్నే అందుకున్నాడు.
ఇంతకాలం పది కోట్ల హీరోగా వున్న శర్వానంద్‌కి దీంతో ముప్పయ్ కోట్ల విజయం దక్కింది. ఇప్పుడతనితో పనిచేద్దామనే దర్శకులు, నిర్మాతల క్యూ రెట్టింపయింది. అలాగే భలే భలే మగాడివోయ్ తర్వాత నేను లోకల్‌తో నాని ఇంకోసారి బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నాడు. పదిహేను కోట్ల నుంచి తన స్థాయిని పాతిక కోట్లకి పెంచుకునే దిశగా దూసుకుపోతున్నాడు. ప్రేమమ్ మినహా ఇటీవలి కాలంలో సోలోగా చైతన్యకి సక్సెస్ ఇచ్చిన సినిమా ఏదీ లేదు. భారీ హిట్ ఇస్తే తప్ప తన బ్యాక్‌గ్రౌండ్‌కి న్యాయం చేసి రేసులో మళ్లీ ముందుకెళ్లలేడు. ఈలోగా సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా పాతుకుపోతే చైతన్య కష్టాలు డబుల్ అవుతాయి. ఇది కనిపెట్టడం వల్లేనేమో చైతన్య మలి చిత్రంపై నాగార్జున చాలా కేర్ తీసుకుంటూ, పర్ఫెక్ట్గా రెడీ అయిందనిపిస్తే కానీ రిలీజ్ చేయనని అంటున్నాడు.
Recent Random Post: