శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా విడాకులు అబద్దమా?

బాలీవుడ్ జంట రాజ్ కుంద్రా-శిల్పాశెట్టి దంపతులు విడాకులతో ధాంపత్య జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కుంద్రా చీకటి వ్యాపారం నీలి చిత్రాల వ్యవహారం బయటకు రావడం సహా గాళ్స్ తో అతగాడి వ్యక్తిగత వ్యవహారాలు బంధాన్ని చీల్చుతున్నట్లు మీడియాలో ప్రచారం అయింది.

రాజ్ కుంద్రాతో విసిగిపోయిన శిల్పాశెట్టి ఇక తనదారి తాను చూసుకుంటుందని మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. అయితే ఇవన్నీ ఓ సెక్షన్ ఆడియన్స్ ఇవన్నీ తప్పుడు కథనాలన్ని ఖండించారు. ఇద్దరి మధ్యా విడిపోయేంత వివాదం లేదని వ్యతిరేకించారు.

తాజాగా చోటు చేసుకున్న సన్నివేశం చూస్తుంటే అవన్నీ కట్టు కథనాలగానే కనిపిస్తున్నాయి. రాజ్ కుంద్రా-శిల్పాశెట్టిల గారాల పట్టి సమీషా రెండవ పుట్టిన రోజుని ఈ జంట నిరాడంబరంగా జరిపింది. దానికి సంబంధించిన వీడియోని పరిశీలిస్తే జంట అన్యోన్యత కనిపిస్తోంది. ఆ వీడియో లో తన తల్లిని ముద్దు పెట్టుకుంటూ ఆమె నాది అని చెబుతుంది.

ఆ సమయంలో పక్కనే రాజ్ కుంద్ర ఉన్నాడు. రాజ్ కుంద్రా శిల్పాశెట్టి పై చేయి వేసి ఆమె నాది అంటుంటే సమీషా నాది నాది అంటూ తండ్రి చేయిని తొలగిస్తుంది. ఈ సన్నివేశాన్ని బట్టే శిల్పాశెట్టి-రాజ్ కుంద్ర ఎంత? సంతోషంగా ఉన్నారన్నది తెలుస్తోంది.

సమీషా పుట్టిన రోజు సంద్భంగా శిల్పాశెట్టి “మీరు నా జీవితంలోకి వచ్చి చాలా సంతోషాన్ని ఇచ్చారు. అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా హృదయాల్ని ప్రేమతో..ఆనందంతో నింపినందుకు ధన్యవాదాలు. నా ప్రియమైన సమీషా నీవు మొదటిసారి శ్వాస తీసుకున్నప్పుడు ఎంతగా ప్రేమించానో అదే ప్రేమను చివరి వరకూ చూపిస్తాను.

నా కంటి పాపలా సంరక్షించుకుంటాను. రెండు సంవత్సరాలు నిండిన నా తల్లికి హ్యాపీ బర్త్ డే“ అంటూ విషెస్ తెలిపింది. ఈ లిటిల్ ప్రిన్సెస్ తల్లిపై చూపించిన ప్రేమ చూసి నెటి జనులు మురిసిపోతున్నారు.

ఇక శిల్పాశెట్టి సినిమా కెరీర్ విషయానికి వస్తే.. దాదాపు ఏడేళ్లు గ్యాప్ తర్వాత మళ్లీ కంబ్యాక్ అయిన సంగతి తెలిసిందే. `హంగామా-2` చిత్రంతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. గత ఏడాది ఆ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. కానీ అనుకున్న ఫలితాలు సాధించలేదు.

ప్రస్తుతం షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో `నికమ్మ` లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. సినిమా ప్రారంభోత్సవం జరిగి నెలలు గుడుస్తోంది. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ డిలే అవుతోంది.

ప్రస్తుతం శిల్పాశెట్టి ఆశలన్నీ ఈ సినిమపైనే పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో శిల్పాశెట్టి వేగం గురించి చెప్పాల్సిన పనిలేదు. హాట్ పోటోలతో..యోగా వీడియోలతో ఇన్ స్టాని నిత్యం షేక్ చేస్తుంది.