శ్రియ భ‌ర్త‌కు క‌రోనా?

స్టార్ హీరోయిన్ శ్రియ స‌ర‌న్ కొన్నేళ్ల కింద‌టే ర‌ష్యాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపార‌వేత్త ఆండ్రీ కొషీవ్‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఎక్కువ కాలం ఇండియాలోనే ఉన్న శ్రియ‌.. ఈ మ‌ధ్య అవ‌కాశాలు త‌గ్గ‌డంతో భ‌ర్త‌తో క‌లిసి ఉంటోంది. వీళ్లిద్ద‌రూ కొన్ని నెల‌లుగా స్పెయిన్‌లో ఏకాంతంగా గ‌డుపుతున్నారు. ఈ స‌మ‌యంలోనే క‌రోనా వైర‌స్ స్పెయిన్‌ను వ‌ణికించ‌డం మొద‌లుపెట్టింది.

ప్ర‌పంచంలో క‌రోనా కార‌ణంగా అత్యంత ప్ర‌భావిత‌మైన దేశాల్లో స్పెయిన్ ఒక‌టి. ఐతే అక్క‌డ ప‌రిస్థితులు ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న స‌మ‌యంలోనే కొన్ని రోజుల కింద‌ట‌ శ్రియ‌, ఆండ్రీ క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కానీ కొన్ని రోజుల్లోనే క‌థ మారిపోయింది.

ఇప్పుడు ఆండ్రీ కొషీవ్ క‌రోనా బారిన ప‌డిన‌ట్లు అనుమానంగా ఉన్న‌ట్లు శ్రియ వెల్ల‌డించింది. కొన్ని రోజుల నుంచి పొడి ద‌గ్గు, జ్వ‌రం ల‌క్ష‌ణాలు కొషీవ్‌లో క‌నిపిస్తున్నాయ‌ని.. దీంతో వెంట‌నే తాము ఆసుప‌త్రికి వెళ్లామ‌ని.. కానీ వైద్యులు అక్క‌డ చేర్చుకోవ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని.. వెంట‌నే ఇంటికి వెళ్లిపోమన్నార‌ని శ్రియ వెల్ల‌డించింది. కొషీవ్‌కు క‌‌రోనా ఉన్నా లేకున్నా ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితుల దృష్ట్యా ఆసుప‌త్రుల్లో ఉంటే క‌చ్చితంగా ఈ వైర‌స్ సోకుతుంద‌ని.. అందుకే ఇంటిద‌గ్గ‌రే క్వారంటైన్లో ఉండి మందులు వేసుకోవాల‌ని చెప్పార‌ని శ్రియ తెలిపింది. దీంతో ఇంటికి తిరిగొచ్చేశామ‌ని.. కొషీవ్ ఒక గ‌దికి ప‌రిమితమై మందులు వాడుతున్నాడ‌ని.. ఇప్పుడు అత‌డి ప‌రిస్థితి మెరుగ్గానే ఉంద‌ని శ్రియ వెల్ల‌డించింది.


Recent Random Post: