జస్ట్ 34 అని చెప్పింది

మొన్నటివరకూ ఆమె గురించి పెద్దగా పట్టించుకున్నోళ్లు లేరు. ఫోటో షూట్ లో పాల్గొన్నా.. ఫ్యాషన్ షోలో భాగంగా ర్యాంప్ వాక్ చేసినా ఆమె ఫోటోను నలుగురిలో నారాయణ అన్నట్లు వేసేవారు. అంతేకానీ.. ఒకప్పుడు ఆమె ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ గా పట్టించుకున్నోళ్లే లేరు. అయినప్పటికీ ఆమె తన ప్రయత్నాల్ని ఆపలేదు. తనకీ ఏదో బ్రేక్ రావటం ఖాయమన్నట్లుగా ఉండేది.

ఆమె అనుకున్నట్లే జరిగింది. అప్పుడప్పుడు అవకాశాలు వచ్చినా అదిరిపోయే బ్రేక్ వచ్చింది లేదు. తాజాగా.. క్రిష్ పుణ్యమా అని శాతకర్ణిలో ఆమె పాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. శ్రియలోని కొత్త విషయాల్ని బయటకు వచ్చేలా చేసింది. ఇండస్ట్రీలో దాదాపు పదిహేడేళ్లుగా ఉంటున్నా.. శ్రియ అంటే గ్లామర్ డాల్ అనే కానీ.. ఆమె కళ్లతోనే చాలా భావాల్ని పలికించగలదు.. అర్థత ఉన్న పాత్రలకు తన నటనతో ప్రాణం పోస్తుందన్న విషయాన్ని గుర్తించినోళ్లు లేరనే చెప్పాలి.

తాజా శాతకర్ణితో ఆమె టాలెంట్ ప్రపంచానికి అర్థమైపోవటమే కాదు.. మరో ఐదారేళ్లు ఆమెకు తిరుగులేనట్లుగా తయారైంది. కుర్రహీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని ఛరిష్మా ఆమెకుందన్న విషయం ప్రూవ్ కావటమే కాదు.. ఆమెను అభిమానించి.. ఆరాధించే వారు చాలామందే ఉన్నారన్న విషయం మరోసారి బయటకు వచ్చింది. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉండటం మామూలే. కానీ.. హీరోయిన్ల విషయంలో అలాంటి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. శ్రియ ఇప్పడా అరుదైన అవకాశాన్ని దక్కించుకుందని చెప్పొచ్చు.

చాలామంది హీరోయిన్ల మాదిరిగా కాకుండా.. శ్రియ స్టైల్ భిన్నంగా ఉంటుంది. విషయం ఏదైనా సరే.. ఆమె సూటిగా చెప్పేస్తుంది. ఏ విషయం వరకో ఎందుకు.. మీ వయసు ఎంతంటే.. టక్కున చెప్పేస్తుందే తప్ప దాచేందుకు ప్రయత్నించరు. అయినా.. వయసును దాచాల్సిన అవసరం ఏముందని ఎదురు ప్రశ్నిస్తుంది. ఇంతకీ శ్రియ వయసు ఇప్పుడెంత? అన్న మాటను అడిగితే.. ఆమె సమాధానం ‘34’ అని. పదిహేడేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చానని.. 65ఏళ్ల వరకూ సినిమాల్లో నటించే ఛాన్స్ లు ఉంటాయని చెప్పేసింది. చూస్తుంటే.. శ్రియ ఇప్పట్లో వెనక్కి తగ్గేటట్లుగా లేదు. మరి.. ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు ఎంతమంది ముందుకు వస్తారో చూడాలి.


Recent Random Post: