అమ్మ‌డివ‌న్నీ డిస్కౌంట్ సేల్ బ‌ట్ట‌లేన‌ట‌

హీరోయిన్ గా ఇమేజ్‌. చేతిలోసినిమాలు.. కోట్లాది రూపాయిల సంపాద‌న‌. ఇన్ని ఉన్నప్పుడు వేసుకునే బ‌ట్ట‌లు రిచ్ గా.. బ్రాండెడ్ గా ఉంటాయ‌ని అనుకోవ‌టం కామ‌న్‌. కానీ.. అలాంటిది ఏ మాత్రం నిజం కాద‌ని చెబుతోంది కాట‌మ‌రాయుడి భామ శృతిహాస‌న్‌. లోక నాయ‌కుడి పెద్ద‌కుమార్తె అయిన శృతి లాంటి హీరోయిన్ డ్రెస్సుల కొనుగోలు ముచ్చ‌ట వింటే షాక్ తినాల్సిందే.

పెద్ద పెద్ద బ్రాండ్స్‌.. డిజైన‌ర్ వేరే వేసుకోవ‌టం ఆమెకు అస్స‌లు ఇష్టం ఉండ‌ద‌ట‌. ఒక‌వేళ తాను బ్రాండెడ్ డ్రెస్సుల్లో క‌నిపిస్తే.. అవి తాను కొనుక్కున్న‌వి కాద‌ని.. బ‌హుమ‌తిగా వ‌చ్చేవ‌ని చెప్పింది. పండగుల స‌మ‌యాల్లో.. ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో పెట్టే డిస్కౌంట్ సేల్ స‌మ‌యంలోనే తాను బ‌ట్ట‌లు కొంటాన‌ని చెబుతోంది శృతిహాస‌న్‌. బ్రాండెడ్ దుస్తులు వేసుకోవ‌టం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని.. డిస్కౌంట్ సేల్ న‌డుస్తున్న‌ప్పుడు తాను వ‌స్త్రాల్ని కొనుగోలు చేస్తాన‌ని చెప్పింది.

రిచ్ గా క‌నిపించాలంటే బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాల్సిన అవ‌స‌రం లేదని.. బాడీకి సూట్ అయ్యే క‌ల‌ర్‌.. కాంబినేష‌న్ సెలెక్ట్ చేసుకుంటే స‌రిపోతుంద‌ని చెబుతోంది. ఇలా అయితే మామూలు డ్రెస్సుల్లోనూ గ్రాండ్ గా క‌నిపించొచ్చంటూ శృతి చెబుతున్న మాట‌లు ఒక ప‌ట్టాన జీర్ణం కావ‌టం క‌ష్ట‌మే.


Recent Random Post: