
దగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ నుంచి విశాల్ సిక్కా ఇలా రాజీనామా చేశాడో లేదో… అలా సంస్థకు గూబలు అదిరిపోయాయి! సిక్కా రాజీనామా వ్యక్తిగతంగా ఆయనకు ఎంత నష్టమో చెప్పలేం కానీ, లక్షల కోట్ల ఇన్ఫీ సామ్రాజ్యంపై మాత్రం పెద్ద దెబ్బే పడింది. దాదాపు వేల కోట్లలో సంపద ఆవిరైపోయింది. వ్యక్తిగతంగా కొంత నష్టమైతే.. వ్యవస్థ పరంగానూ ఇన్ఫీకి భారీ నష్టం తెచ్చిపెట్టింది. గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు నష్టాలు పాలవడంతో ఇన్ఫోసిస్ హై ప్రొఫైల్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి తన బిలీనియర్ స్టేటస్‌ను కోల్పోగా… మరో ఫౌండర్ గోపాలక్రిష్ణన్ కూడా ఆ ట్యాగ్‌ను వదులుకోవాల్సి వచ్చింది.
సీఈవోగా సిక్కా రాజీనామా అనంతరం పతనమవడం ప్రారంభమైన ఇన్పీ షేర్లు, సోమవారం మార్కెట్ ట్రేడింగ్‌కు 14.5 శాతం క్రాష్ అయ్యాయి. దీంతో ఫౌండర్ ప్రమోటర్లు కూడా భారీగా తమ సంపదను కోల్పోయారు. మొత్త ఫౌండర్లు కంపెనీలో 12.74 శాతం వాటాను కలిగి ఉన్నారు. గత గురువారం 1,160 మిలియన్ డాలర్లు(రూ.7,437కోట్లకు పైన)గా ఉన్న గోపాలక్రిష్ణన్ షేర్లు సోమవారం సాయంత్రానికి 998 మిలియన్ డాలర్ల(రూ.6,398 కోట్లు)కు పడిపోయాయి.
ఇక నారాయణమూర్తి, ఆయన కుటుంబం రూ.1000 కోట్లకు పైగానే కోల్పోయింది. 800 మిలియన్ డాలర్ల(రూ.5,129కోట్లు)కు పైన ఉన్న నందన్ నిలేకని సంపద కూడా 750 మిలియన్ డాలర్ల(రూ.4,808కోట్లు) కిందకి దిగజారింది. అటు ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రెండు రోజుల వ్యవధిలోనే రూ.34వేల కోట్లకు పైగా క్షీణించింది. మొత్తంగా ప్రమోటర్లు రూ.4,321 కోట్లను నష్టపోయారు. రూ.30 వేల కోట్లుగా ఉన్న ఫౌండర్ల షేర్లు, సోమవారం సాయంత్రానికి రూ.25,594 కోట్లకు వచ్చి చేరాయి. సిక్కా దెబ్బకు మూడేళ్ల కనిష్ట స్థాయిలకు పడిపోయిన ఇన్ఫీ షేర్లు, మంగళవారం మార్కెట్‌లో కోలుకున్నాయి.
Recent Random Post: