
అప్పుడెప్పుడో ఏడాదిన్నర కిందట ‘బ్రూస్ లీ’ ఆడియో వేడుకలో మాట్లాడిందో.. ఆ తర్వాత శ్రీను వైట్ల నోటి వెంట ఏ మాటా రాలేదు. ఎక్కడా అతను బయట కనిపించింది లేదు. మీడియాతో మాట్లాడింది లేదు. ఏదైనా ప్రెస్ నోట్లో కూడా వాయిస్ ఇచ్చింది లేదు. తన కొత్త సినిమా ‘మిస్టర్ గురించి కూడా ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడింది లేదు. ఈ సినిమా టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన టైంలో కూడా సైలెంటుగానే ఉన్నాడు వైట్ల. ఐతే ఎట్టకేలకు అతను మీడియాతో కమ్యూనికేట్ చేశాడు. ‘మిస్టర్’ రిలీజ్ డేట్ కన్ఫమ్ చస్తూ ఇచ్చిన ప్రెస్ నోట్లో వైట్ల ఈ సినిమా గురించి నాలుగు ముక్కలు మాట్లాడాడు. ఇంతకీ వైట్ల మిస్టర్ గురించి ఏమన్నాడంటే..
‘‘దర్శకుడిగా ‘మిస్టర్’ లాంటి కథ కోసం చాలా రోజుల పాటు ఎదురు చూశాను. మంచి ఎమోషన్స్.. హిలేరియస్ ఎంటర్్టైన్మెంట్.. మ్యూజిక్.. విజువల్స్.. అన్నింటికీ స్కోప్ ఉన్న కథ. రెండు పాటలు మినహా సినిమా పూర్తయింది. ఔట్ పుట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఏదనుకున్నానో అది వంద శాతం రాజీ పడకుండా లేకుండా తీయగలిగాను. అందుకు నా టీంకు థాంక్స్. అందరూ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ సినిమా కోసం స్పెయిన్‌లోని పలు అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేశాం. అలాగే ఇండియాలోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. మిక్కి జే.మేయర్‌తో తొలిసారి పని చేశాను. ఆరు అద్భుతమైన పాటలిచ్చాడు. ఫస్టాఫ్ రీరికార్డింగ్‌తో చూశాను. ఇన్ని వేరియేషన్లున్న బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం చాలా కష్టం. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తాం’’ అని వైట్ల తెలిపాడు.
Recent Random Post: