అభిమాని లెటర్ కు మురిసి పోయిన శ్రీముఖి

ఒకప్పుడు హీరోలకు మరియు హీరోయిన్స్ కు ఇంకా సినీ తారలకు ప్రతి రోజు వందల కొద్ది ఉత్తరాలు వచ్చేవి. అప్పట్లో ఆ ఉత్తరాలను చదివేందుకు ఒకరు ప్రత్యేకంగా ఉండేవారట. కొందరు ఆ ఉత్తరాలకు జవాబు ఇచ్చే వారు. మరి కొందరు మాత్రం ఆ ఉత్తరాలను లైట్ తీసుకునే వారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేసిన వారికి ఎలా అయితే రిప్లై ఇచ్చే వారో అలాగే అప్పుడప్పుడు స్టార్స్ తమకు వచ్చిన బెస్ట్‌ ఉత్తరాలకు సమాధానం ఇచ్చే వారు. ఇప్పుడు ఉత్తరాలు పొందుతున్న సెలబ్రెటీలు ఎవరు లేరు అనే చెప్పాలి. ఉత్తరాలు రాసే అభిమానులు కూడా లేరు అనుకుంటూ ఉన్న సమయంలో యాంకర్‌ శ్రీముఖికి అభిమాని ఉత్తరం రాశాడు.

సోషల్‌ మీడియాలో తన అభిమాని రాసిన ఉత్తరంను శ్రీముఖి షేర్‌ చేసింది. ఈమద్య కాలంలో నాకు వచ్చిన ఉత్తరం అంటూ శ్రీముఖి ఆనందం వ్యక్తం చేసింది. తాను చాలా సంతోషంగా ఉన్నాను అంది. ఇన్ స్టా గ్రామ్ లో ట్యాగ్‌ చేస్తున్న ఈ రోజుల్లో.. వాట్సప్ ల్లో ముచ్చట్లు పెట్టుకునే ఈ రోజుల్లో ఇలాంటి ఉత్తరాలు అందడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇదో కొత్త అనుభూతిని కలిగించిందని శ్రీముఖి చెప్పుకొచ్చింది. సినిమాల్లో మరియు బుల్లి తెరపై సందడి చేస్తున్న శ్రీముఖికి హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉందనే విషయం తెల్సిందే.