యాంకర్‌ శ్రీముఖి ఇంట విషాదం

బుల్లి తెరపై లేడీ యాంకర్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చే పేర్లలో యాంకర్ శ్రీముఖి పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. సుమ తర్వాత మంచి గుర్తింపు దక్కించుకుని ఎన్నో షో లు చేస్తు వస్తున్న శ్రీముఖి చాలా జోవియల్‌ గా ఉంటుంది. ఆమె ఎనర్జీకి అంతా కూడా ఫిదా అవుతూ ఉంటారు. అలాంటి శ్రీముఖి ఎమోషనల్‌ అయ్యింది. కన్నీరు పెట్టుకుంటుంది. ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన విషయం ఆమె అభిమానులకు కూడా కన్నీరు పెట్టించింది.

శ్రీముఖికి ఎంతో ఇష్టమైన అమ్మమ్మ అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆమెతో నేను ఎక్కువ సమయం గడిపేదాన్ని అని.. ఆమె నాకు చాలా సపోర్ట్‌ గా ఉండేది. ఆమెతో నేను ఎక్కువ సమయం గడిపేదాన్ని అంటూ అమ్మమ్మతో డాన్స్ చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి ఏడుస్తున్న ఈమోజీని షేర్‌ చేసింది. అమ్మమ్మ మృతితో శ్రీముఖి కన్నీటి పర్యంతం అయ్యింది. ఆమె మృతి తీరని లోటు అన్నట్లుగా పేర్కొంది. జీవితంలో అమ్మమ్మ ను ఎప్పటికి మర్చిపోలేను.. ఆమెతో గడిపిన క్షణాలు ఎప్పటికి గుర్తుంటాయని శ్రీముఖి పేర్కొంది.