చైతూను దెబ్బ తీసి.. చైతూకే సవాల్

అక్కినేని నాగచైతన్య కెరీర్లో ‘దోచేయ్’ సినిమా పెద్ద నిరాశే మిగిల్చింది. ఈ సినిమా మొదలైనపుడు.. విడుదలకు ముందు మంచి అంచనాలున్నాయి. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ఆ సినిమా ఘోరంగా విఫలమైంది. ‘స్వామిరారా’తో ప్రామిసింగ్ డైరెక్టర్లాగా కనిపించిన సుధీర్ వర్మను అర్జెంటుగా తమ కాంపౌండ్లోకి తెచ్చేసి చైతూ హీరోగా అతడితో సినిమా చేయించేశాడు నాగార్జున. కానీ ఆయన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాడు సుధీర్. ‘దోచేయ్’ సినిమా తరువాత సుధీర్‌కు మళ్లీ ఛాన్స్ దక్కడానికి చాలా టైమే పట్టింది. ఎట్టకేలకు తన తొలి సినిమా హీరో అఖిలే అతడిని కరుణించాడు. అభిషేక్ వాళ్లతో కలిసి సినిమా సెట్ చేశాడు. అదే.. కేశవ.

‘దోచేయ్’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ‘కేశవ’పై జనాల్లో క్యూరియాసిటీ తేగలిగాడు సుధీర్. దీని ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఒక రకమైన ప్రకంపనలు రేపాయి. ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. ‘కేశవ’ను ప్రస్తుతానికి మే 12న రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఐతే ఈ నెల 28న రానున్న ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రభావం మరీ గట్టిగా ఉంటే వారం లేటుగా.. అంటే మే 19న విడుదల చేద్దామని అనుకున్నారు. ‘దువ్వాడ జగన్నాథం’ వాయిదా పడ్డ నేపథ్యంలో ఈ ఆలోచనలో ఉండగా.. అంతలోనే నాగచైతన్య సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ను అదే తేదీకి షెడ్యూల్ చేసేశారు.

మరి ‘బాహుబలి-2’ ప్రభంజనాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో సుధీర్ తన సినిమాను ‘రారండోయ్..’కు పోటీగా తీసుకొస్తాడేమో చూడాలి. అదే జరిగితే చైతూకు ఇబ్బంది తప్పదు. ఒకవేళ యధావిధిగా మే 12న విడుదలై.. ‘కేశవ’ అంచనాల్ని అందుకున్నా చైతూ సినిమాకు దాని వల్ల కొంత ఇబ్బందే. ‘రారండోయ్..’ మీద కూడా అంచనాలు బాగానే ఉన్నప్పటికీ అది ఫ్యామిలీ సినిమాలా కనిపిస్తోంది. సినిమాకు మహరాజ పోషకులైన యూత్‌ను ఎక్కువ ఆకర్షిస్తున్నది మాత్రం ‘కేశవ’నే. మరి ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ సమరంలో ఏది పైచేయి సాధిస్తుందో చూద్దాం.


Recent Random Post: