
ఇంటెల్లిజెంట్ స్క్రీన్‌ప్లేకి పెట్టింది పేరయిన సుకుమార్ ఆ స్టయిల్‌ని ఫాలో అవడంలో చాలా సార్లు ప్రేక్షకులని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాడు. అలాంటి ప్రయోగాలు వికటిస్తే ‘1 నేనొక్కడినే’ మాదిరిగా కమర్షియల్ డిజాస్టర్స్ అవుతాయి. సుకుమార్ చిత్రాలకి మాస్ కేంద్రాల్లో వసూళ్లు రాకపోవడానికి కూడా కారణమిదే. అతనితో చరణ్ సినిమా చేస్తున్నాడంటే చరణ్‌ని కొత్తగా చూపిస్తాడని మెగా అభిమానులకి ఎక్సయిటింగ్‌గానే వున్నా కానీ కన్‌ఫ్యూజింగ్ నెరేషన్‌తో ఎక్కడ తికమక పెడతాడో అనే భయం కూడా వుంది.
పైగా చరణ్ ఇందులో చెవిటివాడిగా కనిపిస్తున్నాడనే సరికి ఇదేదో ప్రయోగమనే భావన వుంది. ఈ అనుమానాలన్నిటికీ తెర వేస్తూ ఇదొక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అని సుకుమార్ చెప్పాడు. తన చిత్రాల్లో కనిపించే తికమక నెరేషన్ ఇందులో వుండదని, కథ స్ట్రెయిట్‌గా వెళుతుందని, క్లారిటీ వుంటుందని తెలియజేసాడు. రామ్ చరణ్ చాలా కొత్తగా కనిపిస్తాడని, అభిమానులు అతడిని చూసి కొత్తగా ఫీల్ అవుతారని, అచ్చమైన పల్లెటూరి వాతావరణం, స్వఛ్ఛమైన మనుషుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం తనకి దర్శకుడిగా మంచి పేరు తెచ్చి పెట్టేది అవుతుందని అన్నాడు.
ఇది ప్రయోగాత్మక చిత్రం కాదని, కమర్షియల్‌గానే వుండే కొత్తరకం సినిమా అని సుకుమార్ భరోసా ఇవ్వడంతో చరణ్ ఫాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
Recent Random Post: