100వ సినిమాకు రెడీ అవుతున్న మరో హీరో

మొన్న సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా.. బాలయ్య 100వ సినిమా రిలీజై దుమ్ము రేపాయి. తెలుగు ఇండస్ట్రీలో 100 సినిమాలు చేసిన హీరోలు ఇంకెవరూ లేరు. మిగతా ఇద్దరు సీనియర్ హీరోలు వెంకటేశ్, నాగార్జునలు సెంచరీకి చేరడానికి ఇంకా చాలా టైం ఉంది. కానీ.. మరో  హీరో మాత్రం  సెంచరీకి చేరువగా ఉన్నాడు. ఎంత చేరువగా ఉన్నారంటూ కేవలం ఒకే ఒక్క సినిమా దూరంలో ఉన్నారు. ఇంతకీ.. ఆయనెవరో తెలుసా..  ఒకప్పుడు హీరోగా దుమ్మురేపి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా హిట్లు కొడుతున్న కరాటే స్టార్ సుమన్. అవును.. సుమన్ హీరోగా ఇంకో సినిమా చేస్తే ఆయనకూ తెలుగులో 100 సినిమాలు పూర్తవుతాయి.

నిజానికి సుమన్ ఇప్పటికే 500 సినిమాలు కంప్లీట్ చేశారు. ఆయన కేవలం తెలుగులో మాత్రమే కాదు, కన్నడ, తమిళ్ లోనూ చాలా సినిమాలు చేశారు.   సౌత్ లోని అన్ని భాషల్లో కలిపి సుమన్ ఇప్పటికే  5వందల చిత్రాలు దాటిపోయాయి.

అయితే తెలుగులో ఆయన ఇప్పటివరకు కంప్లీట్ చేసిన సినిమాల సంఖ్య మాత్రం సరిగ్గా 99. అలా టాలీవుడ్ లో సెంచరీకి చేరువయ్యారు సుమన్. అయితే బాలయ్య తరహాలో సుమన్ కూడా సెంచరీ సినిమాను సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట.  మంచి కథతో వచ్చే దర్శకుల కోసం ఆయన ఎదురుచూస్తున్నారట.


Recent Random Post: