ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్ హైకోర్టులో సవాల్ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా కొనసాగుతారు అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇంకా తాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ను అంటూ తనకు తానుగా నిమ్మగడ్డ రమేష్ ప్రకటించుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పి దాఖలు చేసింది. ప్రభుత్వం చట్టబద్దంగా నిర్ణయం తీసుకుందని, ఆయన తొలగింపులో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదని అలాగే కక్ష పూరిత వ్యవహారం ఏమీ లేదంటూ పిటీషన్లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నిమ్మగడ్డను పదవిలో ఉంచేందుకు సిద్దంగా లేదని ఈ సంఘటనతో మరోసారి నిరూపితం అయ్యింది. న్యాయస్థానంపై న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తప్పకుండా ప్రభుత్వం తరపున న్యాయం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తుందనే నమ్మకంను ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
Recent Random Post: