జగన్కి పాతిక కోట్లే లిమిట్

పూరి జగన్నాథ్ హిట్టిచ్చి చాలా కాలమవుతోంది. కమర్షియల్గా యావరేజ్గా ఆడిన టెంపర్ తప్ప ఈమధ్య పూరి సినిమాలన్నీ వాష్ అవుట్లే. రీసెంట్గా కళ్యాణ్రామ్కి ‘ఇజం’తో కోలుకోలేని షాకిచ్చాడు. ఎప్పుడో తన పారితోషికాన్ని పది కోట్లని ఫిక్స్ చేసుకున్న పూరి జగన్నాథ్ ఇప్పటికీ దానిని తగ్గించుకోవడం లేదట. అవసరమైతే హీరోలని మార్చేస్తున్నాడే తప్ప రెమ్యూనరేషన్ పరంగా డిస్కౌంట్స్ ఇవ్వనంటున్నాడట.

రీసెంట్గా వెంకటేష్తో ఒక సినిమా ఓకే చేయించుకున్న జగన్ ఆ చిత్రానికి కూడా తన పే చెక్ పది కోట్లని తేల్చి చెప్పాడట. పూరికి ఇప్పుడు అంత మార్కెట్ లేదని, వెంకీ మార్కెట్కి మించి బడ్జెట్ పెడితే నష్టమే తప్ప లాభముండదని సురేష్బాబు చెప్పడంతో వెంకీ ఈ ప్రాజెక్ట్పై వెనక్కి తగ్గాడని టాక్.

పూరి చెప్పిన ఐడియాకి ఫిదా అయిన వెంకటేష్ మొదట నిర్మాణంలో భాగస్వామి అవడానికి కూడా సరేనన్నాడట. కానీ సురేష్బాబు రంగంలోకి దిగి పాతిక కోట్లకి మించి పైసా ఖర్చు పెట్టినా వర్కవుట్ అవ్వదని తమ్ముడికి అర్థమయ్యేలా చెప్పాడట.

పూరి పారితోషికం, వెంకీ పారితోషికం కలుపుకుని ఈ చిత్రాన్ని పాతిక కోట్లలో చేసేటట్టయితే చేద్దామని, లేదంటే వేరే నిర్మాతని చూసుకోమని సురేష్బాబు చెప్పాడని, అంత బడ్జెట్లో అయితే పూరికి కనీసం రెండు, మూడు కోట్లు కూడా గిట్టవని, అంచేతే ఈ ప్రాజెక్ట్ డౌట్లో పడిందని సమాచారం.


Recent Random Post: