
సినిమా రివ్యూలు విడుదలైన రోజే కాకుండా మూడు రోజుల తర్వాత రావాలని ఇటీవల రజనీకాంత్, విశాల్ కోరారు. విడుదలయిన రోజే సమీక్షలు వచ్చేస్తోంటే, కలక్షన్లు ఎఫెక్ట్ అవుతున్నాయని, జనం రివ్యూలని, రేటింగులని దృష్టిలో వుంచుకుని సినిమాలు చూస్తున్నారని, వాటి వల్ల ప్రభావితం అవుతున్నారనేది వారి భావన.
అయితే దీంతో ఏకీభవించే వాళ్లు, వ్యతిరేకించే వాళ్లు సినీ రంగంలోనే వున్నారు. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఇదే విషయంపై మాట్లాడుతూ సమీక్షకుల స్వేఛ్ఛకి, మీడియా స్వాతంత్య్రానికి ఎవరూ అడ్డు చెప్పరాదని అన్నారు. ఒక చెత్త సినిమాకి మంచి రివ్యూ ఇచ్చినంత మాత్రాన అది ఆడదని, అలాగే ఒక మంచి సినిమాకి నెగెటివ్ రివ్యూ వచ్చినా ఫలితం మారదని ఆయన చెప్పారు.
ఒక్కోసారి చిన్న చిత్రాలకి ముందుగా పాజిటివ్ రివ్యూలు రావడం వల్ల జరిగే మంచి ఏంటనేది పెళ్లిచూపులు, ఘాజీకి చూసామని, ప్రతి దానికీ రెండు సైడ్స్ వుంటాయని, అంచేత రివ్యూలని ఆపాలనుకోవడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ మీడియా రివ్యూలు ఆపినా సోషల్ మీడియాలో వచ్చే ఒపీనియన్స్‌ని ఎలా ఆపగలరని, అది ఎవరి చేతిలో లేదని, సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని మెరిట్స్‌కి అనుగుణంగా ఆడుతుందే తప్ప దాని ఫలితాన్ని ప్రభావితం చేసే శక్తి దేనికీ లేదనేది తన అభిప్రాయమని ఆయన కుండ బద్దలు కొట్టారు.
Recent Random Post: