
తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన నిర్మాతల్లో సురేష్ బాబు ఒకరు. ఈమధ్య కాలంలో ఆయన కేవలం బ్యాక్ ఎండ్‌లో వుంటున్నారే తప్ప ముందుండి సినిమాలని నడిపించడం లేదు. బాగున్నాయనిపించిన చిన్న సినిమాలని తీసుకుని విడుదల చేయడం లేదా వేరే నిర్మాతలతో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవడం మాత్రమే చేస్తున్నారు.
చాలా గ్యాప్ తర్వాత ఆయననుంచి పూర్తి స్థాయిలో వస్తోన్న సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తనయుడితో ఏ చిత్రం తీయాలా అని చాలా కాలం వేచి చూసి దీనిని ఎంచుకున్న సురేష్‌బాబు ఇప్పుడు మార్కెటింగ్ పరంగా కొడుకు సినిమాకి ఎలాంటి లోటు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. అసలే మరో రెండు పెద్ద చిత్రాలతో పోటీ వుండడంతో వాటి మధ్య రానా చిత్రం చిన్నబోకుండా సురేష్‌బాబు తన విశ్వరూపం ప్రదర్శిస్తూ అన్ని చోట్లా దీనికి ఘనమైన రిలీజ్ వచ్చేలా చూసుకుంటున్నారు.
భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ చిత్రానికి మిగిలిన అన్ని సినిమాల కంటే ఎక్కువ సందడి జరుగుతోంది. ఇంకా మిగతా చిత్రాల నిర్మాతలు అలర్ట్ అవకముందే మొత్తం నేనే రాజు నేనే మంత్రి మాత్రమే ప్రమోషన్స్‌లో హైలైట్ అయ్యేలా సురేష్‌బాబు చాలా కేర్ తీసుకున్నారు. అవడానికి ఈ మూడు సినిమాల్లోను తక్కువ బడ్జెట్ సినిమా అయినా కానీ పబ్లిసిటీ పరంగా మిగిలిన రెండిటి కంటే ఇదే ముందుంది.
పబ్లిక్ అటెన్షన్‌ని బాగా రాబట్టుకుంటోంది. సురేష్‌బాబు మార్కెటింగ్ స్ట్రాటజీ ముందు మిగిలిన వారు వెనకబడిపోతున్నారని ఈ చిత్రానికి మాస్ సెంటర్లలోను జరుగుతోన్న సందడి చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.
Recent Random Post: