మిల్కీ బ్యూటీ తమన్నాని ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా పరిచయమై దశాబ్దం పూర్తయినా, ఇప్పటికీ కెరీర్లో తెలుగు, తమిళ్, హిందీలో ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటోంది. ‘సైరా’ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో ఎక్కువ అవకాశాలు చేజిక్కించుకున్న ఈ భామ ప్రస్తుతం గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో పవర్ఫుల్ తెలంగాణ అమ్మాయి జ్వాలా సింగ్ గా, అది కూడా ఓ కబడ్డీ కోచ్ గా కనిపించనుంది. ఈ జ్వాలా సింగ్ రోల్ కోసం తన లైఫ్ లో ఇప్పటి వరకూ ఆడని కబడ్డీ మొదటిసారి ఆడానని అంటోంది మన మిల్క్ బ్యూటీ. ‘ఫిసికల్ గా, మెంటల్ గా చాలెంజింగ్ ఉన్న రోల్ ఇది. చాలా స్లిమ్, అండ్ ఫిట్ గా ఉండాలి సో పాత్ర కోసం రోజూ హార్డ్ గా ట్రైనింగ్ తీసుకున్నా. నా లైఫ్ లో ఇప్పటి వరకూ కబడ్డీ ఆడలేదు. కానీ ఈ పాత్ర కోసం దాదాపు 2 నెలలు హార్డ్ ట్రైనింగ్ తీసుకున్నాను. అలాగే తెలుగు నాకు బాగా వచ్చినా, తెలంగాణ స్లాంగ్ అనేది కాస్త కష్టమే, అలాంటి టైంలో డైరెక్టర్ సంపత్ నందిగారు హెల్ప్ చేశారు. ప్రతి విషయంలోనూ కంప్లీట్ గా నన్ను నేను మార్చుకున్న పాత్ర జ్వాలా సింగ్’ అని తమన్నా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఈ సినిమాతో పాటు పలు సినిమాలు తమన్నా డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సినిమాలే కాకుండా ఈ ఏడాది తమన్నా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి కూడా అడుగుపెట్టనుంది. తండ్రి కూతురు మద్య సాగే ఒక అన్యోన్యమైన అనుబంధపు కథతో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
Recent Random Post: