నానితో అంతా ‘ఓకే’ అనుకునేలా థమన్ ట్వీట్..!

నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం సమకూర్చారనే సంగతి తెలిసిందే. అయితే బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం మరో సంగీత దర్శకుడు గోపీ సుందర్ తో చేయించడం అప్పట్లో చర్చీనీయాంశం అయింది. ఈ సినిమా విషయంలోనే నాని – తమన్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ప్రచారం జరిగింది. థమన్ సైతం ఓ ఇంటర్వ్యూలో తన బ్యాగ్రౌండ్ స్కోర్ నాని కి నచ్చకోలేదని వెల్లడించారు. అయితే థమన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వారి మధ్య అంతా బాగానే ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

ప్రాజెక్ట్ ఒప్పుకున్న తర్వాత తన చేతి నుంచి వెళ్లిపోయిన సినిమా తన కెరీర్ లో ‘టక్ జగదీష్’ ఒకటేనని ఆ మధ్య చెప్పిన థమన్.. ఆ సినిమాకి తాను చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ హీరో నాని నచ్చలేదని తెలిపారు. అందుకే మళ్ళీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయించుకున్నారని అన్నారు. ఆ విషయంలో కొంచం బాధ పడ్డానని.. ఆలా తన లైఫ్ లో ఫస్ట్ టైం జరిగిందన్నారు. తాను హార్ట్ ఫుల్ గానే వర్క్ చేసానని.. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలియలేదని థమన్ చెప్పారు.

అయితే నాని పెర్ఫార్మన్స్ తనకు బాగా ఇష్టమని.. ఈగ – గ్యాంగ్ లీడర్ తో సహా చాలా సినిమాలు ఇష్టమని థమన్ అన్నారు. నాని సినిమాకు మ్యూజిక్ అందించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని.. తనకు ఈగోలు ఏమీ లేవని.. అలాంటివి బుర్రలో ఉంచుకోనని.. మూవ్ ఆన్ అయిపోతానని థమన్ చెప్పుకొచ్చారు. చెప్పినట్టుగానే ఏదీ మనసులో పెట్టుకోకుండా నాని పుట్టినరోజు సందర్భంగా థమన్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసారు.

”నేను ఎప్పుడూ ప్రేమించే.. కలిసి పనిచేయడానికి ఇష్టపడే వ్యక్తికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. కష్టపడి పని చేయడం.. సినిమాల పట్ల అతని అభిరుచి మరియు అతని ఉత్పాదకత సాటిలేనివి. నా ప్రియమైన సోదరుడు నాని గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని థమన్ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిని బట్టి ‘టక్ జగదీష్’ సినిమా దూరమైనా థమన్.. మళ్ళీ నాని చిత్రానికి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే నాని ప్రస్తుతం ‘అంటే సుందరానికి’ సినిమాతో పాటుగా ‘దసరా’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు థమన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. థమన్ మ్యూజిక్ అందించిన ‘భీమ్లా నాయక్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో ‘గని’ చిత్రంతో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన ‘రాధే శ్యామ్’ మూవీ రిలీజ్ కానున్నాయి.