తమన్ మళ్ళీ కుమ్మేస్తాడట.. సూపర్ ఫ్యాన్స్ కి హింట్

తమన్.. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న సంగీత దర్శకుడు. కొన్నేళ్లుగా తమన్ పాటలు సూపర్ డూపర్ హిట్ అవుతుండటం మనకు తెలిసిందే. కాపీ క్యాట్ అని విమర్శకులు వ్యతిరేకులు ఎన్ని మాటలు చెప్పినా… తమన్ పాటలు మాత్రం సంగీత ప్రియులను సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఆయన దర్శకత్వం నుండి వచ్చిన చాలా పాటలు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లోకి రావడం మనకు తెలిసిందే.

తమన్ అంటే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆయన ఇచ్చే మాస్ బీజీఎం. ఆయనిచ్చే BGM మాస్ తో పాటు క్లాస్ ప్రేక్షకులనూ ఉర్రూతలూగిస్తోంది. ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చి అఖండ చిత్రంలోని పాటలు ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీపై ఎన్ని అంచనాలు వచ్చాయో… తమన్ బీజీఎం కోసం అదే స్థాయి వెయిట్ చేశారు.

అఖండ సినిమా సెకండ్ హాఫ్ థియేటర్లలో వస్తున్నప్పుడు… తమన్ బీజీఎం హోరెత్తించిందనే చెప్పాలి. ఓ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా BGM థియేటర్లలోని ప్రేక్షకులనూ సీట్లలో కూర్చోనివ్వలేదంటే అతిశయోక్తి కాదు.

ఈ సినిమాకు దర్శకత్వం వహించిన బోయపాటికి హీరోగా నటించిన బాలయ్య బాబుకు ఏ స్థాయిలో పేరు వచ్చిందో… అంతకుమించి తమన్ కు పేరు వచ్చింది. ఆయన ఇచ్చిన ఆ ఒక్క బీజీఎంతో తమన్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయనే చెప్పాలి.

తర్వాత తమన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న మూవీ సర్కారు వారి పాట. మహేష్ బాబు నటిస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్ లో బాగానే క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా రెండు మంచి టాక్ అందుకున్నాయి. కళావతి పాటకు చాలా మంది ఫ్యాన్స్ గా మారారు. పెన్నీ పాట కూడా అదే స్థాయిలో అభిమానులను అలరిస్తుంది.

ఈ సినిమా బీజీఎం ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే సర్కారు వారి పాట సినిమాలోని BGM.. సిల్వర్ స్క్రీన్ పై దుమ్ము రేపనుందని తమన్ చెబుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ లో బీజీఎం ఉండబోతోందని.. అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని ట్విట్టర్ ద్వారా తెలిపాడు తమన్.