దక్షిణాది చిత్ర పరిశ్రమలో తమన్నా, శ్రుతిహాసన్ అగ్రహీరోయిన్లు. వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. శ్రుతిహాసన్ అంటే తనకెంత ఇష్టమో పలు సందర్భాల్లో తమన్నా పేర్కొన్నారు. లాక్డౌన్ వేళలో ఇంటికే పరిమితమమైన తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతితో తన అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
చిత్ర పరిశ్రమలో నటీనటులందరిలో కంటే తనకు శ్రుతి అంటే ఎంతో ఇష్టమన్నారు. ఆమె తనకు బెస్ట్ ఫ్రెండ్ అని తెలిపారు. ముంబయ్‌లో తన ఇంటికి దగ్గరే శ్రుతిహాసన్ కుటుంబం కూడా ఉండేదన్నారు. అందువల్లే తామిద్దరూ తరచూ కలుసుకునే వాళ్లమని తమన్నా చెప్పారు. కలుసుకున్నప్పుడల్లా తమ జీవితాల గురించి మాట్లాడుకునేవాళ్లమన్నారు.
ముఖ్యంగా శ్రుతికి నెగిటివిటీ అంటే అసలు ఇష్టం ఉండదన్నారు. శ్రుతిలోని ఆ గొప్ప గుణమే తామిద్దరూ మంచి స్నేహితులు కావడానికి కారణమైందన్నారు. అంతేకాదు, తనను ఇప్పటికీ చిన్న పిల్లలాగే శ్రుతి చూస్తుందన్నారు.
Recent Random Post: