
తమన్నాకి బాలీవుడ్ నుంచి సాదర స్వాగతమే లభించింది కానీ టైమ్ కలిసి రాలేదు. తను నటించిన హిందీ చిత్రాలన్నీ దారుణమైన ఫ్లాప్‌లయ్యాయి. అజయ్ దేవ్‌గణ్, అక్షయ్‌కుమార్‌లాంటి స్టార్లతో నటించినా కానీ తమన్నాని వరుస డిజాస్టర్లు వేధించాయి.
ఆ ఫ్లాపులతో బాలీవుడ్‌లో ఐరెన్‌లెగ్ ముద్ర వేయించుకున్న తమన్నాకి ‘బాహుబలి’లో భాగం కావడంతో మళ్లీ బాలీవుడ్ మేకర్స్ దృష్టి తనపై పడింది. బాహుబలి స్టార్‌కాస్ట్‌లో హిందీ వాళ్లకి ముందుగా తెలిసిన వాళ్లు రాణా, తమన్నాలే. బాహుబలి హీరోయిన్‌గా తమన్నాకి అక్కడ ఇప్పుడు ప్రత్యేక గుర్తింపు వుంది. దీంతో ఈ క్రేజ్‌ని, మునుపటి పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి బాలీవుడ్ మేకర్స్ ఆమెని ఆకర్షణీయమైన ఆఫర్లతో ఊరిస్తున్నారు.
తమిళంలో నయనతార కథానాయికగా నటిస్తోన్న ‘కోలయుత్తీర్ కాలం’ చిత్రాన్ని తమన్నాతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇలాంటి చిత్రంలో సాధారణంగా బాలీవుడ్‌లో పేరున్న హీరోయిన్‌ని తీసుకుంటారు. కంగన లేదా ప్రియాంకతో చేయాల్సిన చిత్రానికి తమన్నాని తీసుకున్నారంటేనే బాహుబలి ఆమె రాతని ఏ స్థాయిలో మార్చేసిందో అర్థమవడం లేదూ! అందుకేనేమో దక్షిణాది చిత్రాల్లో నటించడానికి తమన్నా ఇప్పుడు మునుపు తీసుకున్న పారితోషికానికి రెండింతలు అడుగుతోందట. బాహుబలా, మజాకా!
Recent Random Post: