
మంచు లక్ష్మి తొలిసారి బయటి బేనర్లో లీడ్ రోల్ చేసిన సినిమా ‘లక్ష్మీబాంబు’. ఇంతకుముందు ప్రియమణి ప్రధాన పాత్రలో ‘సాధ్యం’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసిన కార్తికేయ గోపాలకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నాలుగైదు నెలల కిందటే ఈ చిత్రం పూర్తయింది. ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోయింది. కానీ సినిమా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. దీపావళికి అన్నారు.. క్రిస్మస్ అన్నారు.. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడి.. చివరికి మహా శివరాత్రి కానుకగా ఈ నెల 24న సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇంతకుముందు వాయిదా పడ్డట్లే ఈసారి కూడా ఈ సినిమాను వాయిదా వేసేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల కిందట కూడా పేపర్లో ఫిబ్రవరి 24 రిలీజ్ అంటూ యాడ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు థియేటర్లలోకి సినిమా రావట్లేదు. ఆ యాడ్ తర్వాత ప్రమోషన్లు లేవు. బుక్ మై షోలో సినిమా కనిపించడం లేదు. అంటే ‘లక్ష్మీబాంబు’ విడుదల మరోసారి ఆగినట్లే తెలుస్తోంది.
కారణాలేంటో తెలియదు కానీ.. మంచు లక్ష్మి ఈ సినిమా గురించి పట్టించుకోవట్లేదు. మొదట్లో ఈ సినిమాను ఆమె బాగా ఓన్ చేసుకుంది. తన తమ్ముడు మంచు మనోజ్‌తో క్లైమాక్స్ ఫైట్ కూడా కంపోజ్ చేయించుకుంది. కానీ ఈ మధ్య ఈ సినిమా ఊసే ఎత్తట్లేదు. ఫిబ్రవరి 24కు సినిమా ఫిక్సయ్యాక దాని గురించి ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. ట్రేడ్‌లో ఈ సినిమాపై అంత ఆసక్తి లేకపోవడంతో బిజినెస్ అనుకున్నట్లుగా జరగలేదని.. థియేటర్లు కూడా ఆశించినంత దక్కట్లేదని.. అందుకే సినిమా మళ్లీ మళ్లీ వాయిదా పడుతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
Recent Random Post: