నాని.. మరో వీర ప్రేమగాథ

తన విజయ పరంపరను కొనసాగిస్తూ ‘నేను లోకల్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టేశాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’ ఫస్ట్ లుక్ వచ్చేసింది. అది కూడా చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తూ సినిమా మీద అంచనాల్ని పెంచింది. ఈ ఫస్ట్ లుక్‌ను నాని పుట్టిన రోజు కానుకగా విడుదల చేశారు. ఇదే రోజు నాని చేయబోయే మరో సినిమా విశేషాలు కూడా బయటికి వచ్చాయి. ‘నిన్ను కోరి’ సినిమాను జూన్ కల్లా పూర్తి చేయబోతున్న నాని.. ఆ వెంటనే తన కొత్త సినిమాను మొదలుపెట్టేస్తాడట. ఆ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించబోతుండటం విశేషం.

నాని-హను కాంబినేషన్లో గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ‘అందాల రాక్షసి’తో విమర్శకుల ప్రశంసలందుకున్నా.. కమర్షియల్‌ సక్సెస్ సాధించలేకపోయాడు హను. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ అతడికి అన్ని రకాలుగా సంతోషాన్నిచ్చింది. దీని తర్వాత హను.. నితిన్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యే సమయానికే నాని కూడా ఖాళీ అవుతాడు. వెంటనే ఇద్దరూ కలిసి కొత్త సినిమాను మొదలుపెడతారు. ఈ చిత్రానికి ఇప్పటికే కథ రెడీ అయినట్లు సమాచారం. సుధాకర్ చెరువూరి.. ప్రసాద్ చుక్కపల్లి ఈ సినిమాను నిర్మిస్తారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతాన్నందిస్తాడు.


Recent Random Post: