ఎన్టీఆర్‌ బర్త్‌డేకు త్రివిక్రమ్‌ గిఫ్ట్‌పై క్లారిటీ

మరో రెండు వారాల్లో ఎన్టీఆర్‌ బర్త్‌డే రాబోతుంది. ఆయన బర్త్‌డే కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా భారీ వేడుకలు సాధ్యం కాకపోవచ్చు. కాని సోషల్‌ మీడియాలో మాత్రం పెద్ద హంగామా సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఫ్యాన్స్‌ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కౌంట్‌ డౌన్‌ షురూ చేశారు. ఎన్టీఆర్‌ బర్త్‌డేకు ఖచ్చితంగా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం నుండి కొమురం భీమ్‌ వీడియో కాని, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ కాని రానుంది. జక్కన్న ఇచ్చే ఆ సర్‌ప్రైజ్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోతున్న చిత్రంకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. రాధాకృష్ణ మరియు కళ్యాణ్‌ రామ్‌లు ఆ సినిమాను నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్‌ 30 గా ఇప్పటికే సోషల్‌ మీడియా ఆ సినిమా ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా దర్శకుడు త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ప్లాన్‌ చేశాడంటూ వార్తలు వచ్చాయి. ఆ సర్‌ప్రైజ్‌ ఏంటీ అనే విషయమై పలువురు పలు రకాలుగా అనుకున్నారు. అయితే ఎక్కువ శాతం మంది మాత్రం టైటిల్‌ను రివీల్‌ చేయబోతున్నట్లుగా ఊహిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన పుకార్లపై చిత్ర పీఆర్‌ టీం స్పందించింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ 30కి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్‌ కూడా ఎప్పుడు మొదలు పెట్టేది లాక్‌డౌన్‌ పూర్తి అయ్యి ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాత త్రివిక్రమ్‌ నిర్ణయించుకుంటాడు. అప్పటి వరకు ఎవరికి తోచిన ఊహలు వారు చేయవద్దంటూ విజ్ఞప్తి చేశారు. వారి ప్రకటనతో నందమూరి ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది.


Recent Random Post: