వకీల్ సాబ్ రీరిలీజ్ కు రెడీ అవుతోందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలైంది. చిత్రం విడుదలైన వారం రోజుల తర్వాత కరోనా సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో థియేటర్లను మూసి వేశారు. దీనివల్ల వకీల్ సాబ్ బిజినెస్ కు గండి పడిందనే చెప్పాలి.

దాని తర్వాత వకీల్ సాబ్ ను రెండు వారాలకు ఓటిటిలో విడుదల చేసారు. తాజా సమాచారం ప్రకారం వకీల్ సాబ్ ను థియేటర్లలో రీరిలీజ్ చేయబోతున్నారట. జూన్ నెలాఖరుకి థియేటర్లు ఓపెన్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను ఓపెన్ చేస్తే జులై మొదటి వారంలో వకీల్ సాబ్ ను రీరిలీజ్ చేయాలని దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్, బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.