వకీల్‌ సాబ్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా?

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ రెండు వారాల షూటింగ్‌ మినహా మొత్తం పూర్తి అయ్యింది. కరోనా మహమ్మారి అనేది వచ్చి ఉండకుంటే ఇప్పటి వరకు వకీల్‌ సాబ్‌ ప్రేక్షకులను కలుసుకునే వాడు. కాని కరోనా కారణంగా షూటింగ్‌ గత నాలుగు నెలలుగా అలాగే మిగిలి పోయింది. బ్యాలన్స్‌ వర్క్‌ను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేశాడంటూ వార్తలు వచ్చాయి. కాని కరోనా విజృంభిస్తున్న తీరుతో ఆయన సినిమా షూటింగ్‌ మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపించలేదు.

సినిమాను విడుదల చేయకున్నా పవన్‌ ఫ్యాన్స్‌ కోసం దిల్‌రాజు ప్రత్యేకమైన బర్త్‌డే ట్రీట్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వకీల్‌ సాబ్‌ మూవీ టీజర్‌ ను 1 నిమిషం నిడివితో పవర్‌ బర్త్‌ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. సెప్టెంబర్‌ 2 న పవన్‌ బర్త్‌డే ఉంది. మరో నెలన్నర రోజులు మాత్రమే అందుకు సమయం ఉంది కనుక అప్పటి వరకు టీజర్‌ను రెడీ చేయాలంటూ దర్శకుడు వేణు శ్రీరామ్‌కు సూచించాడట. నిమిషం నిడివి ఉండేలా ప్లాన్‌ చేశారట. మళ్లీ సినిమా ట్రైలర్‌ విడుదల చేయకూడదని భావిస్తున్నారట. ట్రైలర్‌ లేకుండా ఒక నిమిషం టీజర్‌ తోనే సినిమాను విడుదల చేస్తారనే టాక్‌ వినిపిస్తుంది.

బాలీవుడ్‌ పింక్‌ చిత్రంకు రీమేక్‌ గా రూపొందుతున్న వకీల్‌ సాబ్‌ చిత్రంలో పవన్‌ మొదటి సారి లాయర్‌ గా కనిపించబోతున్నాడు. పింక్‌ లో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. కాని వకీల్‌ సాబ్‌లో మాత్రం పవన్‌ ఫ్యాన్స్‌కు కిక్‌ ఇచ్చే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని మేకర్స్‌ అంటున్నారు. పింక్‌ ఫస్ట్‌లుక్‌ మరియు వకీల్‌ సాబ్‌ ఫస్ట్‌లుక్‌ పోల్చి చూస్తే వకీల్‌ సాబ్‌ మాస్‌ మసాలా ఎలిమెంట్స్‌తో ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. చాలా గ్యాప్‌ తీసుకుని పవన్‌ చేసిన ఈ చిత్రంపై ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.


Recent Random Post: