దసరా తర్వాతే వకీల్ సాబ్ కు పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా సినిమా వకీల్ సాబ్. మాములుగా అయితే ఈ సినిమా ఈపాటికి విడుదలైపోయేదే కానీ అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ ప్రభావం వల్ల షూటింగులు దాదాపు ఏడు నెలల పాటు నిలిచిపోయిన సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే వకీల్ సాబ్ షూటింగ్ గత నెలలో తిరిగి మొదలైంది. అయితే అందులో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు. పవన్ అవసరం లేని సీన్లను వకీల్ సాబ్ టీమ్ షూట్ చేసారు. ప్రస్తుతం ఆ షెడ్యూల్ పూర్తయింది.

ఇక తాజా సమాచారం ప్రకారం పవన్ వకీల్ సాబ్ షూట్ లో దసరా తర్వాత నుండి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలాఖరు నుండి మొదలయ్యే షెడ్యూల్ పవన్ తో పాటు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న శృతి హాసన్ కూడా పాల్గొంటుంది. దాదాపు 20 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. నవంబర్ ఎండ్ కు వకీల్ సాబ్ ను పూర్తి చేయనున్నాడు పవన్.

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో వకీల్ సాబ్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Recent Random Post: