సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం దాదాపు మూడేళ్లు వెయిట్ చేసాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఊపిరి సినిమా తర్వాత మహేష్ బాబు వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నా కానీ సూపర్ స్టార్ కోసం మరో సినిమా ఒప్పుకోకుండా వెయిట్ చేసాడు. దర్శకుడు తనకోసం వెయిట్ చేయడంతో మహేష్ కూడా ఫ్లాట్ అయిపోయాడు. దానికి తోడు మహర్షితో తనకు మరపురాని విజయాన్ని అందించడంతో వెంటనే మరో సినిమా చేస్తానని మాట ఇచ్చేసాడు. ఇక వంశీ ఫుల్ ఖుషీ అయిపోయాడు. వెంటనే మహేష్ కోసం ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను రాసుకున్నాడు. ఈలోగా సరిలేరు నీకెవ్వరు చేసిన మహేష్, ఆ తర్వాత వంశీ చెప్పిన కథను విన్నాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ వచ్చింది. వంశీ చెప్పిన కథను విన్న మహేష్ కు అది నచ్చలేదు. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని వేరే వెర్షన్ వినిపించినా కానీ మహేష్ ఆసక్తి చూపించలేదు.
ఈలోగా మహేష్ పరశురామ్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. సరే ఆ తర్వాతైనా తనకు అవకాశమొస్తుందని భావిస్తే ఆ ఆశలకు కూడా గండి పడింది. ఇటీవలే మీడియాతో ముచ్చటిస్తూ రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేష్ తో ఉంటుందని ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ వార్తతో వంశీ పైడిపల్లి పూర్తిగా ఆశలు వదిలేసుకోవచ్చు. అందుకే ఇక ప్రత్యామ్నాయాలు కోసం చూస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒక్కడే నెక్స్ట్ సినిమాను ఒప్పుకోలేదు. ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఆచార్యలో స్పెషల్ రోల్ చేయనున్నాడు చరణ్. ఆ తర్వాత సినిమాను ఇంకా కమిట్ అవ్వలేదు. సో వంశీ పైడిపల్లికి రామ్ చరణ్ బెస్ట్ ఆప్షన్. మరి దాన్నైనా ఉపయోగించుకుంటాడా అన్నది చూడాలి.
Recent Random Post: