
తమిళ హీరో విశాల్, శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి మధ్య ప్రేమాయణం చాలా కాలంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. పెళ్లిపై ఇంకా నిర్ణయానికి రాలేదు కానీ, ఈ జంట ఒక్కటిగా వుంటోందనేది ఓపెన్ సీక్రెట్. వరలక్ష్మికి పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఆమె కెరియర్‌ని తీర్చిదిద్దే బాధ్యత కూడా విశాల్ తీసుకున్నాడు. అతను నటిస్తోన్న ‘పందెంకోడి’ సీక్వెల్‌లో వరలక్ష్మి ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
ఇందులో నెగెటివ్ షేడ్స్ వుండే ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కి వరలక్ష్మిని తీసుకున్నారు. దర్శకుడు లింగుస్వామి ఈ క్యారెక్టర్ ఎవరైనా స్టార్‌తో చేయించాలని అనుకున్నాడు కానీ ఎవరూ దొరకలేదు. దాంతో విశాల్ ఈ క్యారెక్టర్‌కి తన గాళ్‌ఫ్రెండ్‌ని రికమండ్ చేసాడు. ‘నరసింహా’లో రమ్యకృష్ణ క్యారెక్టర్ అంత సక్సెస్ అవుతుందని భావిస్తోన్న ఈ పాత్రతో అయినా వరలక్ష్మి సుడి తిరుగుతుందేమో మరి. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. కొంతకాలంగా చెప్పుకోతగ్గ హిట్లు లేని విశాల్ ఈ చిత్రంతో బౌన్స్ అవుతానని ఆశిస్తున్నాడు.
ఇప్పుడు దర్శకుడు లింగుస్వామికి కూడా ఈ ఫలితం చాలా కీలకం. ప్రస్తుతం సక్సెస్‌లు లేకపోవడంతో అతడిని చాలా మంది హీరోలు దూరంగా పెడుతున్నారు. రెండుసార్లు తనతో సినిమా అనౌన్స్ చేసిన అల్లు అర్జున్ ఇంతవరకు దానిని ముందుకి తీసుకెళ్లనేలేదు.
Recent Random Post: