
ఆగడు, బ్రూస్ లీ ఫెయిల్యూర్లతో నేలమీదికి వచ్చేశాడు శ్రీను వైట్ల. మరోవైపు ‘కంచె’తో వచ్చిన పేరంతా ‘లోఫర్’తో పోగొట్టుకున్నాడు వరుణ్ తేజ్. వీళ్లిద్దరూ తమ తర్వాతి సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకుని.. గత ఏడాది ‘మిస్టర్’తో జత కట్టారు. ఈ పాటికి విడుదల కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూ ఉంది.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా వరుణ్ తేజ్ మోకాలికి పెద్ద గాయం కావడంతో రెండు నెలలు ఇంటిపట్టున ఉండిపోయాడు. దీంతో షెడ్యూళ్లన్నీ దెబ్బ తిన్నాయి. ఆ మధ్య ఒక ప్లెజెంట్ టీజర్‌తో ఆకట్టుకున్న ‘మిస్టర్’ ఆ తర్వాత వార్తల్లో లేదు. ఈ సినిమా విడుదల గురించి కూడా ఏ సమాచారం లేదు.
ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి ఈ చిత్రం వార్తల్లోకి వచ్చింది. ‘మిస్టర్’ను వేసవి కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తి కావచ్చిందని.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ 7న గురు, చెలియా సినిమాలు విడుదలవుతుంటే.. 28న ‘బాహుబలి: ది కంక్లూజన్’ రాబోతోంది. బాహుబలి-2కు ముందు వారం సినిమాలేవీ రిలీజ్ చేసే సాహసం చేయకపోవచ్చు. అంటే ఇక మిగిలింది ఏప్రిల్ రెండో వారాంతం మాత్రమే. దాన్ని ‘మిస్టర్’ బుక్ చేసుకున్నాడు.
వరుసగా రొటీన్ కామెడీలతో విసుగెత్తించేసిన శ్రీను వైట్ల.. కొంచెం రూటు మార్చి రొమాంటిక్ లవ్ స్టోరీ చేయడం విశేషం. ‘ఆనందం’ రోజుల్ని గుర్తుకు తెచ్చింది ‘మిస్టర్’ టీజర్. ఇందులో లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్ కథానాయికలుగా నటించారు. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Recent Random Post: