ఏదైనా జగన్ తర్వాతే అంటున్న విజయ్!

డియర్ కామ్రేడ్ విడుదల కాకముందు విజయ్ దేవరకొండ కాస్త దూకుడు మీద ఉండేవాడు. పలు సినిమాలు లైన్లో పెట్టి ఫుల్ స్పీడ్ గా వర్క్ చేసేవాడు. కానీ డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ ఫలితాల తర్వాత విజయ్ దేవరకొండలో మార్పు వచ్చింది. ఫెయిల్యూర్ భయం పట్టుకుంది. అందుకే దూకుడు పని చేయదని నిశ్చయించుకున్నాడు.

పూరి జగన్నాధ్ తో చేసున్న సినిమాపై విజయ్ దేవరకొండకి ఎనలేని నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రం విడుదలయ్యే వరకు మరే సినిమా గురించి ఊసే వద్దని డిసైడ్ అయ్యాడు. పూరి సినిమా జూన్ లో వస్తుందని విజయ్ ఆశించాడు. కానీ లాక్ డౌన్ వల్ల ఇప్పట్లో రాదని తేలిపోవడంతో కాస్త నిరాశ చెందాడు.

అయినప్పటికీ ఈతీరిక సమయంలో కూడా విజయ్ ఎవరి కథలు వినడానికి ఆసక్తి చూపించడం లేదు. తనకి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు ఏదైనా కథ ఉందని కబురు చేసినా కానీ ఏదైనా జగన్ సినిమా బయటకి వచ్చాకే అంటున్నాడు.


Recent Random Post: