లైగర్ లో విజయ్ కు ఉన్న లోపమేంటి?

విజయ్ దేవరకొండ బాక్సర్ గా నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో బిజీగా ఉంది. లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానున్న విషయం తెల్సిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా అనన్య పాండే హీరోయిన్ గా చేసింది.

ఈ సినిమాకు సంబంధించి తాజా సమాచారం ఏమిటంటే ఇందులో విజయ్ నత్తి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. ఇది చిత్రంలో కీలక భూమిక పోషిస్తుందని తెలుస్తోంది. ఇక విజయ్ పాత్ర చిత్రణ ప్రధాన హైలైట్ గా నిలవనుందిట.

లైగర్ తర్వాత విజయ్ – పూరి జగన్నాథ్ కలిసి మరో సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. జనగణమన టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ జులై నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. సమంత కథానాయిక.