ఎన్టీఆర్‌ సినిమా కోసం ‘మాస్టర్‌’ విలన్‌

తమిళ స్టార్ నటుడు విజయ్‌ సేతుపతి ప్రస్తుతం మోస్ట్‌ వాంటెడ్‌ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ ఉన్నాడు. దేశ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. దాంతో ఆయన కోసం ప్రస్తుతం ఫిల్మ్‌ మేకర్స్ అడ్వాన్స్‌ పట్టుకుని వేచి చూస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ఉప్పెన సినిమా లో విలన్ గా నటించి మెప్పించిన విజయ్‌ సేతుపతి మాస్టర్‌ సినిమా తో పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ దక్కించుకున్నాడు. ఈ సమయంలో ఈయనకు ఎన్టీఆర్ 31 మేకర్స్ నుండి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విజయ్‌ సేతుపతి ని ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్‌ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు సంప్రదించారట. అందుకు విజయ్‌ సేతుపతి ఓకే అన్నాడని సమాచారం అందుతోంది. విజయ్‌ సేతుపతి ఇప్పటికే మైత్రి వారితో కలిసి ఉప్పెన సినిమా కోసం వర్క్‌ చేశాడు. ఆ సమయంలోనే మరో సినిమాను చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ అడ్వాన్స్ ను ఎన్టీఆర్ 31 సినిమాకు వినియోగించే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్‌ సినిమా క్రేజ్‌ ను మరింత పెంచేందుకు ఖచ్చితంగా విజయ్‌ సేతుపతి హెల్ప్‌ అవుతాడు. సలార్‌ రూపొందిస్తున్న ప్రశాంత్‌ నీల్‌ ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు.