
ఇంతకుముందు మురుగదాస్ ‘రమణ’ సినిమాను చిరంజీవి హీరోగా ‘ఠాగూర్’ పేరుతో రీమేక్ చేశాడు వి.వి.వినాయక్. అప్పటికి వినాయక్ సూపర్ ఫామ్‌లో ఉండేవాడు. అప్పట్లో అతడి పెన్ను కూడా పదును మీద ఉండేది. తమిళ మాతృకను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా.. చిరంజీవి ఇమేజ్‌కు సరిపోయేలా చక్కగా రీమేక్ చేశాడు వినాయక్. తెలుగు వెర్షన్లో చాలా మార్పులు కనిపించాయి. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ విషయంలో మాత్రం వినాయక్ ముద్ర అంతగా కనిపించలేదు. కామెడీ ట్రాక్ యాడ్ చేయడం.. పాటల్ని మాస్ ప్రేక్షకులు మెచ్చేలా.. చిరంజీవి అభిమానుల్ని ఉర్రూతలూగించేలా తీర్చిదిద్దడం మినహాయిస్తే సినిమాలో ఎక్కడా వినాయక్ ముద్ర కనిపించదు.
‘ఖైదీ నెంబర్ 150’ చాలా వరకు తమిళ వెర్షన్‌కు జిరాక్స్ కాపీలా కనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే మక్కీకి మక్కీ దించేశాడు వినాయక్. ఒక చిన్న మార్పు కూడా కనిపించలేదు. ఒరిజినల్లో విజయ్ లాగా సాదాసీదాగా కనిపించకుండా చిరంజీవిని కొంచెం రిచ్‌గా చూపించడం మినహాయిస్తే షాట్ టు షాట్ యాజిటీజ్ దించేశాడు. ఇక మూల కథకు సంబంధించిన సన్నివేశాలన్నీ కూడా డిట్టోలాగా అనిపిస్తాయి. చెన్నై సిటీతో పోలిస్తే హైదరాబాద్‌లో నీటి సరఫరా వ్యవస్థ భిన్నంగా ఉన్నా సరే.. సినిమా విషయంలో ఒరిజినల్‌నే ఫాలో అయిపోయాడు వినాయక్.
హీరో అండ్ కో పైపులైన్లకు అడ్డం పడి ఎపిసోడ్‌కు సంబంధించి తమిళ వెర్షన్‌కు డిట్టోలా కనిపిస్తుంది. పైపులైన్లో చిరుతో పాటు ముసలి వాళ్లను చూపించే సీన్ అయితే కెమెరా యాంగిల్‌తో సహా యాజిటీజ్‌గా దించేశాడు. ఇక్కడో పాటను మినహాయిస్తే చివరి అరగంటలో మాతృకకు… రీమేక్‌కు తేడా ఏమీ కనిపించదు. ఫినిషింగ్ టచ్ మాత్రం కొంచెం డిఫరెంటుగా ఇచ్చాడు వినాయక్. మొత్తానికి చిరు ఆకాంక్షలకు తగ్గట్లు వినాయక్ పని చేసినట్లు కనిపిస్తుంది తప్ప.. దర్శకుడిగా తన ముద్రంటూ చూపించే ప్రయత్నం పెద్దగా చేయలేదనే చెప్పాలి.
Recent Random Post: