
తెలుగువాడైన తమిళ హీరో.. మరోసారి దుమ్ముదులిపాడు. రెండేళ్ల కిందట నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్ సహా ఉద్ధండుల్ని ఢీకొట్టి జయకేతనం ఎగుర వేసిన విశాల్.. ఈసారి తమిళ నిర్మాతల మండలిని సవాల్ చేసి గెలిచాడు. ఏడాది కిందట నిర్మాతల మండలిపై వారిపై ఘాటు విమర్శలతో రణరంగంలోకి దిగిన విశాల్.. ఇప్పుడు మండలి ఎన్నికల్లో తిరుగులేని విజయంతో రియల్ హీరో అనిపించుకున్నాడు.
ఆదివారం జరిగిన ఎన్నికలకు సంబంధించి లేట్ నైట్ ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో నిర్మాతల మండలి కొత్త అధ్యక్షుడిగా విశాల్ ఎన్నికయ్యాడు. మొత్తం 1059 ఓట్లు పోలవగా.. విశాల్ 478 ఓట్లతో జయకేతనం ఎగురవేశాడు. రాధాకృష్ణన్ 333 ఓట్లతో రెండో స్థానం సాధించాడు. కేఆర్ అనే మరో అభ్యర్థి 220కి పైగా ఓట్లు సంపాదించాడు.
మిగతా రెండు వర్గాల్లో పాత తరం నిర్మాతలే ఎక్కువగా ఉండగా.. గత దశాబ్ద కాలంలో నిర్మాతలైన యువతరం అంతా విశాల్ వైపు నిలిచింది. ఈ ఎన్నికల్లో విశాల్ వర్గానికే చెందిన ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్ ఉపాధ్యక్షులుగా ఎన్నికవడం విశేషం. మొత్తం పదవుల్లో కేవలం ఒక్కటి మాత్రమే వేరే వర్గానికి వెళ్లింది. మిగతా పదవులన్నింట్లోనూ విశాల్ టీమే విజయం సాధించడం విశేషం. నడిగర్ సంఘం మ్యాజిక్‌నే నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ రిపీట్ చేసి హీరో అయిపోయాడు విశాల్.
Recent Random Post:

















