‘150’కి మూడు నెలలు… వాట్ నెక్స్ట్

ఈ రోజుల్లో స్టార్ హీరోల కంటే కూడా స్టార్ డైరెక్టర్లకే డిమాండ్ ఎక్కువుంటోంది. పేరున్న దర్శకుల కోసం హీరోలే వెయిటింగ్‌లో ఉంటున్నారు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు హీరోల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి రావడం ఆశ్చర్యమే. సంక్రాంతికి విడుదలై నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి దర్శకుడైన వినాయక్.. ఇప్పటిదాకా తన తర్వాతి ప్రాజెక్టు సంగతేంటో తేల్చలేదు. ‘ఖైదీ నెంబర్ 150’ విడుదలై ఇవాళ్టికి సరిగ్గా మూడు నెలలైంది.

ఈ మూడు నెలల్లో వినాయక్ తర్వాతి సినిమాకు సంబంధించి ఒక చిన్న అడుగు కూడా పడలేదు. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌తో వినాయక్ తర్వాతి సినిమా ఉండొచ్చని ఆ మధ్య కొంచెం ప్రచారం జరిగింది. కానీ తర్వాత అదేమీ లేదని తేలిపోయింది. ఫ్లాపుల్లో ఉన్న తేజు కూడా వినాయక్‌కు డేట్లు ఇవ్వలేదు. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ‘జవాన్’ మొదలుపెట్టేశాడు. ముందు హీరో కన్ఫమ్ అయితే.. ఆ తర్వాత తన రచయితలతో కథ రెడీ చేయిద్దామని చూస్తున్నాడు వినాయక్.

కానీ పేరున్న హీరోలెవ్వరూ అతడి చేతికి చిక్కట్లేదు. తేజు లాంటి వాడే అందుబాటులో లేడంటే ఇక పెద్ద హీరోల గురించి చెప్పేదేముంది..? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇలా ప్రతి హీరో కనీసం రెండేసి ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టేశారు. వీళ్లెవ్వరూ కూడా వినాయక్ రేంజిలో లేరిప్పుడు. ఇక హీరోల గురించి వెయిట్ చేయడం కంటే వినాయక్ ఏదో ఒక కథ రెడీ చేయించి.. దానికి తగ్గ, అప్పటికి అందుబాటులో ఉండే హీరోను చూసుకోవడం బెటరేమో.


Recent Random Post: