
తెలుగు చిత్ర సీమలో టాప్ పొజిషన్‌ని వదిలేసుకుని బాలీవుడ్ వెళ్లిన ఇలియానాకి అడపాదడపా ఆఫర్లు వస్తున్నాయే తప్ప బిజీగా లేదు. తీరిక ఎక్కువ దొరకడంతో బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తూ ఫోటోగ్రాఫర్ అయిన అతగాడికి తన నగ్న దేహాన్ని ఫోటోలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
వాటిలో కొన్నిటిని ఫాన్స్‌తోను షేర్ చేసుకుంటూ కనువిందు చేస్తోన్న ఇలియానా ఎలాంటి కథలు పడితే అలాంటివి చేయకూడదని అనుకుంటున్నానని చెప్పింది. అయితే తన కెరియర్లో చేసినవన్నీ గ్లామర్ పాత్రలేననేది ఇలియానా మర్చిపోయినట్టుంది. ఏదో ఆర్ట్ సినిమా హీరోయిన్‌లా మాట్లాడుతూ విలువల గురించి లెక్చర్లు దంచుతోంది.
తనకి అవకాశాలు తగ్గిపోయాయని చెప్పలేక ఇలా కథలు నచ్చడం లేదనే రొటీన్ స్టేట్‌మెంట్ ఇస్తోంది. అంతే కాకుండా తనకి అవకాశాలు ఇవ్వమని అడుక్కునే అలవాటు లేదని, ఆఫర్ల కోసం దేహీ అననని, వాళ్లకి తాను కరక్ట్ అనిపిస్తే ఆఫర్‌తో వాళ్లంతట వాళ్లే వస్తారని, అంతే తప్ప బిజీ కావడం కోసం క్యారెక్టర్‌ని చంపుకోలేనని ఇలియానా చెప్పింది.
Recent Random Post: