రవితేజకి డైరెక్టర్‌తోనే ప్రాబ్లమ్‌

దిల్‌ రాజుతో ‘ఎవడో ఒకడు’ అనే సినిమా అనౌన్స్‌ చేసిన తర్వాత పారితోషికం విషయంలో పేచీ వచ్చి డీల్‌ కాన్సిల్‌ చేసుకుని వెళ్లిపోయిన రవితేజ మళ్లీ ఇప్పుడు రాజుతోనే ‘రాజా ది గ్రేట్‌’ ఎందుకు చేస్తున్నట్టు? ఒకవేళ ఇద్దరి మధ్య సమస్య సెటిల్‌ అయినట్టయితే, అప్పుడు చేద్దామనుకున్న కథ వదిలేసి కొత్త కథకి ఎందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు? రవితేజకీ, దిల్‌ రాజుకీ అసలు గొడవ వచ్చింది పారితోషికం విషయంలో కాదట.

వేణు శ్రీరామ్‌ అనే దర్శకుడితో చేయడానికి రవితేజ ఆసక్తి చూపించలేదట. ఓ మై ఫ్రెండ్‌ అనే ఫ్లాప్‌ సినిమా తీసిన దర్శకుడితో కంటే ఎవరైనా హిట్‌ డైరెక్టర్‌తో చేద్దామని చెప్పాడట. అలాగే తనకి పరిచయం వున్న ఇద్దరు దర్శకుల పేర్లు చెప్పి వారితో చేద్దామని సలహా ఇచ్చాడట. కానీ వేణు శ్రీరామ్‌తో మరో సినిమా తీస్తానని మాటిచ్చిన దిల్‌ రాజు అందుకు ఒప్పుకోలేదట.

అలా ఆ సినిమా ఆగిపోయింది. అనిల్‌ రావిపూడి అంటే హిట్లు తీసిన దర్శకుడు కావడంతో రవితేజ ఎలాంటి కంప్లయింట్స్‌ లేకుండా ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. వేణు శ్రీరామ్‌కి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి దిల్‌ రాజు ఇప్పుడతడితో నాని సినిమా చేస్తున్నాడు. నాని ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా వుండడంతో ఈ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాదిలో మొదలు పెడదామని డిసైడ్‌ అయ్యారు. అయితే రవితేజ కోసం రాసిన కథ కాకుండా నాని కోసం మరో కథని వేణు శ్రీరామ్‌ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.


Recent Random Post: