సాయిధరమ్‌తేజ్‌ విన్‌ అవడం వీజీ కాదు

‘విన్నర్‌’నంటూ వస్తోన్న సాయిధరమ్‌ తేజ్‌ ముందు భారీ టార్గెట్టే వుంది. ఈ చిత్రం ఇరవై ఏడు కోట్ల రూపాయల షేర్‌ కలెక్ట్‌ చేస్తే తప్ప హిట్‌ అనిపించుకోదట. అంటే దాదాపుగా సుప్రీమ్‌ ఎంత వసూలు చేసిందో అంత చేస్తే ఇది జస్ట్‌ హిట్‌ అనిపించుకుంటుంది. సుప్రీమ్‌తో కొట్టాడు కదా, ఈసారి అంత కష్టమేం కాదని అనుకోవచ్చు. అయితే సుప్రీమ్‌ పీక్‌ సమ్మర్‌లో రిలీజ్‌ అయింది.

నాలుగు వారాల పాటు రన్‌ వచ్చింది కాబట్టి అంత దూరం వెళ్లగలిగింది. ‘విన్నర్‌’కి హాలిడే రిలీజ్‌ అయితే కుదిరింది కానీ ఆ తర్వాత అంతగా అనుకూలించని సమయం. ఫిబ్రవరి నెలాఖరులో వచ్చి భారీ విజయాలు అందుకున్న సినిమాలేవీ కనిపించవు. అంటే విన్నర్‌ అల్లాటప్పా హిట్టనిపించుకుంటే చాలదన్నమాట.

ఇంత రికవరీ జరగాలంటే బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే కానీ జనాలు థియేటర్లకి కదిలి రారు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బజ్‌ కూడా ఏమంత లేదు. ట్రెయిలర్‌ చాలా రొటీన్‌గా వుండడం, గోపిచంద్‌ మలినేని ఖాతాలో భారీ విజయాలు లేకపోవడంతో ‘విన్నర్‌’ లో బజ్‌తోనే రిలీజ్‌ అవుతోంది.

తన ముందున్న పెద్ద టార్గెట్‌ని అన్‌ సీజన్‌లో దాటేసి విన్నర్‌ అనిపించుకుంటే సాయిధరమ్‌ తేజ్‌పై ట్రేడ్‌ సర్కిల్స్‌లో వున్న నమ్మకం రెట్టింపవుతుంది. మరి విన్నర్‌ అవుతాడో, హాండ్సప్‌ అంటాడో మరి కొద్ది గంటల్లో ఒక ఐడియా వచ్చేస్తుంది.


Recent Random Post: