అనసూయ భరద్వాజ్… అందానికి తోడు అభినయం కలగలిపిన నటి. ఈమె సినిమాల్లో చేసే క్యారెక్టర్లకు ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటుందో నెట్టిన చేసే వ్యాఖ్యలతో కూడా అదే స్థాయిలో నెగిటివిటీ సంపాధించుకుంటుంది. ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూ తనదైన స్టైల్ లో స్పందించి హాట్ టాపిక్ గా మారుతుంటుంది. ఆమెకు ఉన్న దుడుకు తనమే ఎక్కువ మంది శత్రువులను తెచ్చిపెడుతోంది. అయితే తాజాగా ఈమె చేసిన ఓ కామెంట్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో అర్జున్ రెడ్డి సినిమాలో భాగంగా విజయ్ దేవరకొండ పలికిన ఓ బూతు మాటను తనకు నచ్చలేదని.. తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు అనేక మంది ఆమెపై ట్రోల్స్ చేయగా.. తాజాగా ఆమె మరోసారి ఖుషీ పోస్టర్ లో తన పేరుకు ముందు The అని పెట్టుకోవడం అవసరమా అని ప్రశ్నించింది. ఇదే ఆమె చేసిన తప్పు అయిపోయింది. దీంతో విజయ్ ప్యాన్స్ తో పాటు నెటిజెన్లు కూడా ఆమె తీరును తప్పు పట్టారు.
వారం రోజులుగా ఈ గొడవ సాగుతూనే ఉంది. అయితే విజయ్ ను తప్పుపడుతున్న నువ్వు… స్టార్ హీరోలు పెట్టుకుంటున్న బిరుదుల గురించి మాట్లడగలవా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా నీకు అవసరమా అని కొందరు అనసూయకు నోటి దూల చాలా ఎక్కువని మరి కొంత మంది చెబుతున్నారు. మరోవైపు తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ రీ ట్వీట్లు చేస్తున్నారు.
కేవలం బూతులు తిడుతున్న వారికి మాత్రమే నువ్వు రిప్లై ఇస్తావని మాలా పొలైట్ గా మాట్లాడే వారిని పట్టించుకోవని అంటున్నారు. అయితే అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం చాలా మందికే నచ్చనట్లుగా తెలుస్తోంది. ఇండస్ట్రీలోనే ఉంటూ ఇలా హీరోపై కామెంట్లు చేయడం సరికాదని భావిస్తున్న అర్థం అవుతోంది. అయితే తాజాగా అనసూయ కామెంట్లపై డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన స్టైల్ లో స్పందించారు.
రౌడీ బాయ్ పుట్టిన రోజు సందర్భంగా The పాషన్ పీ హాస్ The టెంపర్ హీ హోల్డ్స్ The యాంగర్ హీ కంట్రోల్స్ The స్టార్ డమ్ హీ అచీవ్డ్ మేక్స్ హిమ్ The విజయ్ దేవరకొండ.. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ట్వీట్ చేశారు.
ఇన్నిసార్లు The వాడడంతో అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ పడిందని నెటిజెన్లు అంటున్నారు. అలాగే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా టీం కూడా వారందరి పేర్ల ముందు The చేర్చుకొని అనసూయకు కౌంటర్ ఇచ్చారు. మరి వీటన్నిటిని తట్టుకొని ఆమె నిలబడగలదా లేదా చూడాలి.
Recent Random Post: