
రాయ్ లక్ష్మీ అంటే తెలుగులో ‘రత్తాలు’ అనే ఐటమ్ బాంబ్ గుర్తుకొస్తోందిప్పుడు. చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ అలాంటిది. హీరోయిన్గా తెలుగులో ఆమె ‘పెర్ఫామ్’ చేసి మార్కులు తెచ్చుకున్నది చాలా చాలా తక్కువేనని చెప్పక తప్పదు. తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించిన రాయ్ లక్ష్మీ, సౌత్‌లో ఇతర భాషల సినిమాలతో పోల్చితే, మలయాళ సినిమాలే కష్టమని చెబుతోంది.
ఆ మాటకొస్తే, ఏ నటికి అయినా మలయాళ సినిమాలు ఓ ఛాలెంజ్ లాంటివని అంటోంది రాయ్ లక్ష్మీ. ఎందుకంటే, అక్కడ గ్లామర్‌తో నెట్టుకొచ్చేయాలనుకోవడం కుదరదట. ‘మలయాల సినీ పరిశ్రమ చాలా ప్రత్యేకమైనది. అక్కడ ఎవరైనాసరే, నటనతోనే రాణించాలి. కేవలం గ్లామర్‌తో అవకాశాలు దక్కించుకుంటామంటే, ఆ పప్పులుడకవక్కడ..’ అని చెబుతున్న రాయ్ లక్ష్మీ, తన వరకూ తాను గ్లామరస్ పాత్రల్ని ఎక్కువగా ఇష్టపడ్తాననీ, అయితే గ్లామరస్ పాత్రల్లోనూ నటనతో మెప్పించగలిగే నేర్పు తనలో వుందని చెప్పుకొచ్చింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో.
బాలీవుడ్లో రాయ్ లక్ష్మీ నటించిన ‘జూలీ-2’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సినిమాలో నటిస్తున్నప్పుడు, తనకు మలయాళ సినీ పరిశ్రమలో నటించిన అనుభవాలు గుర్తుకొచ్చాయనీ, ఆ స్థాయిలో ఈ ‘జూలీ-2’లో నటనకు ఆస్కారం వుంటుందని రాయ్ లక్ష్మీ అంటోంది. అయితే, ఇప్పటిదాకా తాను ఏ సినిమాలోనూ కన్పించనంత హాట్‌గా ‘జూలీ-2’లో కన్పించబోతున్న మాట వాస్తవమేననీ, దాంతోపాటుగా నటిగా తనకు ఈ సినిమా కెరీర్ బెస్ట్ అవుతుందనీ ధీమా వ్యక్తం చేసింది రాయ్ లక్ష్మీ.
Recent Random Post:

















