అదిరింది రీమేక్ లో చిరంజీవి, పవన్, మహేష్!

విజయ్ నటించిన కత్తి సినిమాను ఖైదీ నంబర్ 150గా రీమేక్ చేశాడు చిరంజీవి. ఇప్పుడు అదే విజయ్ నటించిన మెర్సెల్ సినిమాను కూడా చిరంజీవి రీమేక్ చేస్తే బాగుండేదనే టాపిక్ వైరల్ అవుతోంది. అదిరింది పేరిట ఈరోజు విడుదలైన మెర్సల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఇది. ఈ మూవీని యాజ్ ఇటీజ్ గా చిరంజీవీ రీమేక్ చేసుంటే వంద కోట్ల రూపాయల వసూళ్లతో పాటు పొలిటికల్ గా కూడా చిరంజీవికి మంచి మైలేజీ వచ్చేదని చాలామంది ఫీలింగ్.

మరో సెక్షన్ మాత్రం పవన్ కల్యాణ్ పేరును తెరపైకి తీసుకొచ్చింది. కాటమరాయుడు లాంటి రీమేక్స్ బదులు అదిరింది లాంటి ప్రాజెక్టుల్ని పవన్ సెలక్ట్ చేసుకుంటే.. అతడి కెరీర్ కు ఓ మంచి హిట్ దక్కేదని, రాజకీయ రంగప్రవేశానికి కూడా మంచి రూటు దొరికేదని పోస్టులు పడుతున్నాయి. పవన్ కు రీమేక్స్ కొత్త కాదు. కాబట్టి మెర్సెల్ సినిమా రీమేక్ రైట్స్ ను పవన్ ముందుగానే రిజర్వ్ చేసుకుంటే బాగుండేదని అతడి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈ లిస్ట్ లోకి మహేష్ కూడా వచ్చాడు. నిజానికి అదిరింది సినిమాలో విజయ్ పోషించిన తండ్రి పాత్రకు మహేష్ సూట్ కాడు. కానీ ఈ రీమేక్ మహేష్ చేస్తే సూపర్ హిట్ అయిపోతుందంటూ మరో చర్చ షురూ అయింది. డాక్టర్, మెజీషియల్ పాత్రలకు మహేష్ అతికినట్టు సరిపోతాడనేది వీళ్ల వాదన.

ఎవరెన్ని చర్చలు పెట్టినా జరగాల్సింది జరిగిపోయింది. ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ థియేటర్లలోకి వచ్చేయడంతో ఇక రీమేక్ అనే మాటకు తావు లేదు. అయినప్పటికీ ఓ మంచి కమర్షియల్ మూవీని మన హీరో మిస్ అయిపోయాడనే బాధ మాత్రం ప్రతి అభిమానికి కలిగింది. సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఈ చర్చలన్నీ గమనిస్తే ‘అదిరింది’ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చిందనే విషయం అర్థమౌతోంది.


Recent Random Post: