ఆర్.ఎక్స్ 100 సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న అజయ్ భూపతికి ఇంతవరకు రెండో సినిమా ఓకే అవలేదు. రవితేజతో మొదలవుతుందని అనుకున్న మహా సముద్రం సినిమా అర్ధాంతరంగా ఆగిపోయిన తర్వాత అతనికి అవకాశం రావడం లేదు. రవితేజ రిజెక్ట్ చేయకముందు పలువురు హీరోలు అతనితో పని చేయడానికి ఆసక్తి చూపించారు. రవితేజ నో అన్న తర్వాత నాగ చైతన్య కోసం కొద్ది రోజులు చూసాడు.
ఆ తర్వాత శర్వానంద్ దగ్గరకు వెళ్ళాడు. జాను ప్లాప్ తర్వాత శర్వా కూడా జాగ్రత్త పడుతున్నాడు. దీంతో అజయ్ భూపతికి ఇప్పుడు హీరో లేడు. పలువురు నిర్మాతలు అతనికి అడ్వాన్స్ అయితే ఇచ్చారు కానీ ఇతను హీరోని తెచ్చుకుంటే కానీ వాళ్ళు సినిమా మొదలు పెట్టరు.
అసలే కరోనా బ్రేక్ తో సినిమా షెడ్యూల్స్ అన్నీ దెబ్బ తిన్న నేపథ్యంలో అజయ్ సినిమా పట్టాలెక్కాలంటే ఇప్పట్లో కష్టమే.
Recent Random Post: