ఇది కాలా కాదు… కబాలి పార్ట్-2

ఒకే దర్శకుడు.. సేమ్ జానర్ కు చెందిన కథ.. సంగీత దర్శకుడు కూడా ఒకడే. అలాంటప్పుడు సినిమాలో కొత్తదనం ఎలా వస్తుంది. అందుకే కాలా సినిమా కబాలి పార్ట్-2గా తయారైంది. ఈ టీజర్ చూసిన జనాలంతా కబాలిని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

కబాలిలో స్టయిలిష్ మాఫియా డాన్ గా కనిపించాడు రజనీకాంత్. కాలాలో మాస్ మాఫియా డాన్. ఇదొక్కటే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అనిపిస్తోంది. అక్కడ పేద ప్రజల కోసం కబాలి ఫైట్ చేస్తే.. ఇక్కడ కూడా పేదల కోసం కాలా ఫైట్ చేస్తాడు. చివరికి టీజర్ లో సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ట్యూన్ కూడా కబాలి టైటిల్ సాంగ్ ను గుర్తుకుతెచ్చింది.

సూపర్ హిట్ సినిమా నుంచి కాపీ కొడితే సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చు. కానీ కబాలి సినిమా పెద్ద డిజాస్టర్. అలాంటి సినిమాను గుర్తుకుతెచ్చేలా కాలా ఉందంటే ఇక ఏమనుకోవాలి. టీజర్ మొత్తంమీద చెప్పుకోదగ్గ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే.. అది రజనీకాంత్ యాక్టింగ్, స్టయిల్ మాత్రమే. రజనీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 27న థియేటర్లలోకి వస్తోంది.


Recent Random Post: