
‘ఏనుగు అలా నడిచి వెళుతోంటే కుక్కలు మొరుగుతాయ్..’ ఇది ఎప్పటినుంచో ప్రాచుర్యంలో వున్నమాటే. ఏనుగంత గొప్పతనం కలిగి వున్నా, కుక్కల్లాంటి నీఛ బుద్ధి వున్నవాళ్ళ నుంచి విమర్శల్ని ఎదుర్కోక తప్పదన్నది ఆ మాటలోని భావం. ఇప్పుడు ఇదే ‘మాట’ని ‘అందాల రాక్షసి’ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఎందుకిలా.? ఈ ప్రశ్నకి సమాధానం సింపుల్. తమిళంలో ఓ సినిమా ఒప్పుకుని, ఆ సినిమా నుంచి తప్పుకుంది లావణ్య త్రిపాఠి. దాంతో, ఆ నిర్మాతని నిండా ముంచేసిందంటూ లావణ్య త్రిపాఠిపై ఆరోపణలు వచ్చాయి. అదే ‘100 పర్సంట్ కాదల్’. తెలుగులో ‘100 పర్సంట్ లవ్’గా తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమానే తమిళంలో ‘100 పర్సంట్ కాదల్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలో హీరోయిన్‌గా ‘అర్జున్ రెడ్డి’ ఫేం షాలిని పాండే నటిస్తోంది.
లావణ్య కారణంగా తమకు 3 కోట్లు నష్టమొచ్చిందని ఆరోపిస్తూ, ‘100 పర్సంట్ కాదల్’ నిర్మాత, తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించిన విషయం విదితమే. దాంతో, లావణ్య మీద 3 కోట్ల జరీమానా విధించారనీ వార్తలొచ్చాయి. ఈ వ్యవహారంపై స్పందించిన లావణ్య ‘అదేమీ లేదు’ అని లైట్ తీసుకున్నా, సోషల్ మీడియాలో అయితే లావణ్యకి వ్యతిరేకంగా పోస్టింగ్స్ మాత్రం ఆగడంలేదు. మరోపక్క, మీడియాలో కథనాలూ షరామామూలుగానే ఆమెపై కొనసాగుతున్నాయి.
దాంతో, లావణ్యకి ఒళ్ళు మండి ఇదిగో.. ఇలా ఈ ఫొటోని, దాంతోపాటుగా పై క్యాప్షన్‌నీ జోడించిందన్నమాట. ఏనుగు – మొరిగే కుక్కలు.. మరీ ఇంత దారుణంగానా లావణ్యా.? ఏంటీ అతి.! అంటూ లావణ్యపై మళ్ళీ సోషల్ మీడియాలో ట్రాలింగ్ షురూ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం.
Recent Random Post:

















